Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 నిమిషాలకు 5 కోట్లు.. అది నా కష్టానికి ప్రతిఫలం.. విచారణ సిగ్గుచేటు: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ అయి.. ప్రపంచ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన భారతీయ నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ నెటిజన్లకు ట్రీట్ ఇస్తున్న ప్రియాంక చోప్రా..

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (12:41 IST)
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ అయి.. ప్రపంచ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన భారతీయ నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ నెటిజన్లకు ట్రీట్ ఇస్తున్న ప్రియాంక చోప్రా.. ఇటీవ‌ల జీ సినీ అవార్డుల వేడుక‌లో ఐదు నిమిషాల డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌కు రూ.5 కోట్లు తీసుకుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. 
 
ఈ వార్తలపై తాజాగా ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. ఐదు నిమిషాలకు ఐదు కోట్లు తీసుకోవడం తన కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనే తాను భావిస్తున్నట్లు తెలిపింది. కష్టపడితే ఫలితం రావాలి కదా.. ఇదే ప్రశ్నను హీరోలను ఎందుకు అడగరని మీడియాను ఎదురు ప్రశ్న వేసింది. తాను ఈ  స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడ్డాను. కష్టానికి తగిన ప్రతిఫలమే ఇదని ప్రియాంక చెప్పింది. 
 
తనను ఈ ప్రశ్న తనను అడగటం హాస్యాస్పదమని.. హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటున్నందుకు గర్విస్తున్నానని.. దీనిపై విచారణలు చేపట్టడం సిగ్గుచేటు అంటూ మీడియాకు కౌంటరిచ్చింది ప్రియాంక. తనకిచ్చే చెక్ మీద ఎన్ని సున్నాలున్నాయనే విషయాన్ని తాను పట్టించుకోనని.. తన ఆలోచన ఆ సున్నాలకు తగిన న్యాయం చేశానా లేదా అనే విషయం చుట్టే తిరుగుతాయని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments