Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను క‌ల‌చివేసింది- రాబోయే త‌రానికి ఇవా ఇచ్చేది - ఎన్‌.టి.ఆర్‌. సూటిప్ర‌శ్న‌

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (16:13 IST)
NTR
అసెంబ్లీలో చంద్ర‌బాబు నాయుడు భార్య‌నుద్దేశించి వైసిపి వారు అన్న‌మాట‌ల‌కు చ‌ల‌న‌చిత్ర‌రంగం తీవ్రంగా ప‌రిణ‌గిస్తోంది. ఒక్కొక్క‌రు ముందుకు వ‌చ్చి త‌మ వాణిని వినిపిస్తున్నారు. శ‌నివారంనాడు ఎన్‌.టి.ఆర్‌. త‌న అభిప్రాయాన్ని వీడియోలో ఇలా తెలియ‌జేశారు.
 
- మాట మ‌న వ్య‌క్తిత్వానికి ప్ర‌మాణం. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌ర్వ సాధార‌ణం. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న పెట్టి దిగ‌జారిపోయిన‌ట్లు నిన్న అసెంబ్లీ సాక్షిగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న న‌న్ను క‌ల‌చివేసింది. 
- వ్య‌క్తిగ‌త దూఫ‌ణ‌లతో దిగ‌జారుతున్నామో అనిపిస్తుంది. ముఖ్యంగా ఆడ‌ప‌డ‌చుల గురించి పరుష ప‌ద‌జాలంతో మాట్లాడే తీరు అచార‌క పరిణామాల‌కు దారితీస్తుంది. ఆడ‌ప‌డ‌చుల‌ను గౌర‌వించ‌డం మ‌న సంప్ర‌దాయం. అది మ‌న ర‌క్తంలోనే ఇమిడిపోయింది. రాబోయే త‌రానికి భాష‌ను, సంప్ర‌దాయాల‌ను భ‌ద్రంగా అప్ప‌గించాలి. కానీ మ‌న సంక్రుతిని కాల్చివేసి అదే బంగారు బాట అనుకోవ‌డం పెద్ద త‌ప్పు.
 
- ఈ మాట‌లు నేను ఇలాంటి ఒక వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు గురైన‌టువంటి కుటుంబ స‌భ్యుడిగా మాట్లాడ‌డం లేదు. కొడుకుగా, భ‌ర్త‌గా, తండ్రిగా దేశ పౌరుడిగా మాట్లాడుతున్నాను. సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. 
- అరాచ‌క సంక్రుతిని ఆపేయండి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడండి. రాబోయే త‌రానికి బంగారు బాట వేయండి. ఇది నా విన్న‌పం. ఇది ఇక్క‌డితో ఆగిపోతుంద‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

ఈజీ మనీ పేరుతో అమ్మాయిల ట్రాప్.. ఆపై నగ్న వీడియోలు చిత్రీకరణ.. లైవ్ స్ట్రీమింగ్

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments