Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అక్కయ్య ఏడ్చుకుంటూ వస్తే వాడ్ని చంపేయాలనుకున్నా.. సమాజం మారాలి: పవన్

తాను ఏడో తరగతి చదువుతున్న సమయంలో మా అక్కయ్య ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. వచ్చేదారిలో ఎవడో పోకిరి తన చెయ్యిపట్టుకుని వేధించాడని చెప్పింది. ఆ దృశ్యాన్ని ఎందరో చూసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ తనకు మాత్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (13:40 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ పరిస్థితులు ఇతరత్రా అంశాలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మరోసారి ఉత్తరాది, దక్షిణాది అంశాలను లేవనెత్తారు. ఉత్తర భారతీయుల ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోతుంటే.. దక్షిణాది వారిపై వివక్ష కొనసాగుతుందని పవన్ విమర్శలు గుప్పించారు. పోరాటం ఎలా ఉండాలో తెలుగువారు తమిళుల నుంచి నేర్చుకోవాలన్నారు. సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేధం విధించినా పోరాడి మరీ తమ సంప్రదాయాన్ని దక్కించుకున్నారని పవన్ ప్రశంసలు గుప్పించారు. 
 
ఈ సందర్భంగా తన చిన్ననాటి స్మృతులను కూడా పవన్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి విధుల్లో భాగంగా రెండేళ్లకోసారి బదిలీ అయి వేరే చోటికి వెళుతుంటే, ప్రతి ఊరిలో తమను వేరే వాళ్లుగా చూసేవారని చెప్పుకొచ్చారు. తాను ఏడో తరగతి చదువుతున్న సమయంలో మా అక్కయ్య ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. వచ్చేదారిలో ఎవడో పోకిరి తన చెయ్యిపట్టుకుని వేధించాడని చెప్పింది. ఆ దృశ్యాన్ని ఎందరో చూసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.

కానీ తనకు మాత్రం ఆ దుర్మార్గుడిని చంపేయాలన్నంత కోపం వచ్చిందని పవన్ చెప్పారు. అలాంటి వారిపై చూస్తున్న జనం ఎందుకు స్పందించరనేదేనని పవన్ తెలిపారు. అవినీతి సమాజం, అవినీతి రాజకీయాల వల్లనే ఇలా జరుగుతోందని తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రలోభపెట్టేవారికి చట్టాలు అనుకూలంగా పనిచేయడం దురదృష్టకరం. మన సమాజం మారాలని పవన్ పేర్కొన్నారు. 
 
ఏపీ గురించి మాట్లాడుతూ.. ఏపీని విభజించిన విధానం నన్ను చాలా బాధించిందని చెప్పారు. 17 సంవత్సరాల పాటు కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి, ఆపై అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. సరైన విధానం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విభజించారు. ఇండియాలో ఒకే భాష మాట్లాడుతున్న తెలుగువారిని విభజన పేరిట దూరం చేశారు. అంతరాలు పెంచారు. దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ఈ పరిణామం బాధించింది. ఏం చేయాలో తెలియలేదు. ఆపై మిత్రులతో చర్చించిన మీదటే రాజకీయాల్లోకి వచ్చాను. ఆపై ఏం జరుగుతూ ఉందో మీ కందరికీ తెలిసిందే" అని పవన్ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్

Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

ఆ నగల్లో వాటా ఇవ్వండి లేదంటే అమ్మ చితిపై నన్నూ కాల్చేయండి (Video)

వల్లభనేని వంశీకి తీరని కష్టాలు.. బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments