Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓపీ-శశికళ ఇద్దరూ బానిసలే.. అమ్మ ఆత్మ చివరికి ఎవరిని దీవిస్తుందో?: రామ్ గోపాల్ వర్మ

తమిళనాట రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడని నేపథ్యంలో.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోటికి పనిచెప్పాడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే రామ్ గోపాల్ వర్మ తమిళ రాజకీయాలపై మరోసారి స్ప

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (13:00 IST)
తమిళనాట రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడని నేపథ్యంలో.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోటికి పనిచెప్పాడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే రామ్ గోపాల్ వర్మ తమిళ రాజకీయాలపై మరోసారి స్పందించాడు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాత రోమన్ సామెత ‘యూ టూ బ్రూటస్?’ గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు. 
 
తమిళ రాజకీయాలపై ట్విట్టర్‌లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. శశికళ, పన్నీర్ సెల్వంలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో పన్నీర్ సెల్వం బానిసలా ఉండేవారని, ఆ విషయాన్ని గుర్తు చేసుకుని శశికళ ఆశ్చర్యపడుతోందని ట్వీట్‌లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ అంతకంటే ముందు తానే ఓ బానిసలా ప్రవర్తించిన విషయాన్ని మాత్రం శశికళ మర్చిపోయిందని పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రి సీటు కోసం అటు అమ్మ నెచ్చెలి.. ఇటు అమ్మ వీరవిధేయుడి మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపు ఎవరికోనని వర్మ ప్రశ్నించారు. అంతేగాకుండా "జయలలిత ఆత్మ ఏమని ఆలోచిస్తుందో?"అంటూ అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా అమ్మ ఆత్మ చివరికి పన్నీరును దీవిస్తుందా? నెచ్చెలి చిన్నమ్మను దీవిస్తుందా? అని సంశయం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 80మంది పాలస్తీనియన్ల మృతి

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments