Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ అంటే చాలా ఇష్టం - నాగార్జున అంద‌గాడుః కశిష్ ఖాన్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:04 IST)
Kashish Khan
రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మించారు. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ కశిష్ ఖాన్ మీడియాతో ముచ్చటించారు.
 
- ఆడిషన్స్ కోసం నా మేనేజర్ సతీష్ ఇన్ స్టాగ్రాంలో మెసెజ్ చేశారు. కానీ మొదట నమ్మలేదు. అలా మూడు నెలలు  రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇచ్చాక ఆడిషన్ చేశారు. సెలెక్ట్ అయ్యాను.ఈ చిత్రంలో మంచి పాత్రలో కనిపిస్తాను. పక్కింటి అమ్మాయిలా అనిపిస్తాను.
 
- నాకు ఇదే మొదటి సినిమా. లైట్స్, కెమెరా అంటే ఏంటో కూడా తెలీదు. కానీ రాజ్ తరుణ్ ఎంతో సహకరించారు. అన్ని విషయాల్లో సాయం చేశారు. ఆయన దగ్గరి నుంచి ఎంతో నేర్చుకున్నాను.
 
- నా మొదటి చిత్రం అన్నపూర్ణ బ్యానర్‌లో రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నన్ను సెలెక్ట్ చేసినందుకు సుప్రియ మేడంకు థ్యాంక్స్. ఆమె లేడీ బాస్. సెట్‌లో అందరినీ బాగా చూసుకునే వారు. ఎంతో సురక్షితంగా అనిపించింది.
 
Kashish Khan
- డైరెక్టర్ శ్రీనుకు క్లియర్ విజన్ ఉంది. అందుకే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయలేదు. ఏం కావాలి.. ఎలా చేయాలని చెప్పేవారు. మేం చేసేవాళ్లం. సెట్ అంతా సందడి వాతావరణంగా ఉండేది. సినిమాల్లో కూడా అది కనిపిస్తుంది.
 
- ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. నీ వల్లేరా అనే పాట నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, యాక్షన్, ఎమోషన్, లవ్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ప్రేక్షకులు ఆశించవచ్చు.
 
- షూటింగ్ కంటే రెండు వారాల ముందే నా డైలాగ్స్‌ను ప్రాక్టీస్ చేశాను. నా అసిస్టెండ్ డైరెక్టర్లు ఎంతో సాయం చేశారు. ఒక్కో పదాన్ని ఎలా పలుకుతారో తెలుసుకున్నాను. చాలా కష్టంగా అనిపించింది. కానీ ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేశాను.
 
డబ్బింగ్‌లో తెలుగు సినిమాలు చూశాను. నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. నాకు ప్రతీ పాత్రను పోషించాలని ఉంది. సింపుల్ నుంచి గ్రాండియర్ వంటి కారెక్టర్‌ను పోషించాలని ఉంది. యాక్టర్ అయితే ఈ ఒక్క జీవితంలోనే ఎన్నో పాత్రలను పోషించవచ్చు. అందుకే నేను నటిగా మారాను.
 
- నాగార్జున అంద‌గాడు. ఆయ‌న రూంలోకి ఎంట్రీ అయితే అందరూ ఆయన్ను చూస్తుంటారు. నేను ఆయన్ను చూసి ఆ! అంటూ ఆశ్చర్యపోయాను. ఆయన నా ముందున్నారు అనే ఫీలింగ్‌‌లో అలా ఉండిపోయాను.
 
నా మొదటి సినిమా విడుదల కాబోతోందన్న ఆనందంగా ఉంది.కానీ నర్వస్‌గా ఫీలవుతున్నాను. విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
 
- ఎమోషనల్ సీన్స్ చేయడం నాకు చాలా కష్టంగా మారింది. అదే నాకు సవాల్ అనిపించింది. తెలుగు భాష కూడా చాలెంజింగ్‌గా అనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments