విష్ణు కంటే మోహన్ బాబు గారి నుంచి మంచి నేర్చుకున్నా; మనోజ్

దేవీ
సోమవారం, 19 మే 2025 (16:34 IST)
Manchu manoj
మంచు ఫ్యామిలీ ఇప్పుడు చాలా హాట్ టాపిక్. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ పేర్లు వింటేనే సోషల్ మీడియా ఆసక్తినెలకొంటుంది. నిన్న ఏలూరు లో భైవరం ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న మనోజ్, నేను చచ్చేంతవరకు మోహన్ బాబుగారి కొడుకునే అన్నారు. ఇక సోమవారంనాడు ఆయన హైదరాబాద్ లో మీడియాలో మాట్లాడారు. రేపు మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పిచ్చాపాటీ మాట్లాడుతూ,  తన తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని, అందులో చాలా మంచి విషయాలున్నాయని పేర్కొన్నారు. నీతి నిజాయితీ, నిబద్ధత, మాటకు కట్టుబడి వుండడం, ముక్కుసూటిగా మాట్లాడడం వంటివి నాకు అలవిన అలవాట్లని చెప్పారు.
 
Manchu manoj
షూటింగ్ కు కూడా టైంకు వెళ్ళడం, టైమ్ సెన్స్ నాన్నగారి నుంచి నేర్చుకున్నానన్నారు. భైవరం షూటింగ్ లో కూడా కరెక్ట్ గా టైంకు వెళ్ళే వాడిని. ఒక్కోసారి షూటింగ్ పోస్ట్ పోన్ అయినా, ఎదుటివారి వల్ల ఇబ్బంది కలిగినా శాంతంగా వుండడం అలవడిందనీ, అంతకుముందు కొంచెం స్పీడ్ గా వుండేవాడినని తెలిపారు.
 
ఇక మంచు విష్ణు నుంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు మనోజ్ కాసేపు ఆలోచించారు. ఏమి నేర్చుకున్నానో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కానీ ఏ ప్రశ్నకైనా సమాధాన చెప్పడం ఆయన్నుంచి ఇంకా నేర్చుకోవాల్సి వుందని సెటైరిక్ గా మాట్లాడారు. అడిగిన విలేకరితో.. నీతో ఫోన్ మాట్లాడతానని సరదాగా వ్యాఖ్యానించారు. భైరవంలో బెల్లంకొండ శీనివాస్, నారా రోహిత్ తో కలిసి నటించారు. బెల్లంకొండ వల్లే నాకు భైరవం ఆపర్ వచ్చిందన్నారు. నారా రోహిత్ మా ఫ్యామిలీ మెంబర్ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...

చిరుత దాడుల నుంచి అడ్డుకోవాలంటే అడవుల్లోకి మేకలను వదలండి : మహా మంత్రి

Pemmasani Chandrasekhar: ఎంపీల పనితీరుపై సర్వే.. 8.9 స్కోరుతో అగ్రస్థానంలో పెమ్మసాని

భారత్ ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉపాధి అవకాశాలు.. శ్రీధర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments