తొమ్మిది సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. నేను ఎప్పుడో చేసిన సినిమాలు గుర్తుపెట్టుకుని మళ్లీ కం బ్యాక్ ఇవ్వు అని మీరు ఎంతగానో ప్రేమ చూపించారు. మీకు ఎలా థాంక్స్ చెప్పుకోవాలో నాకు తెలియలేదు. సినిమా ద్వారానే మీకు థాంక్స్ చెప్పాలి. నా కట్టే కాలేవరకు మోహన్ బాబు అబ్బాయినే అని ఎమోషన్ గా మాట్లాడారు మంచు మనోజ్. ఆయన నటించిన భైరవం మే 30 న విడుదలకాబోతోంది. ఏలూరులో ప్రీరిలీజ్ నిర్వహించారు.
అక్కడ మనోజ్ మాట్లాడుతూ, సొంత వాళ్ళే దూరం పెట్టిన రోజుల్లో మీరు ఇంత దగ్గరగా చేర్చుకుని ఇంత ప్రేమ పంచుతున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే దానికి మీరే కారణం. నాకు ఇంత ప్రేమ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. తొమ్మిదేళ్ల తర్వాత భైరవం సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు రాధా మోహన్ శ్రీధర్ గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. డైరెక్టర్ విజయ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా చాలా గొప్పగా తీశారు. బెల్లంకొండ సాయి నా తమ్ముడు లాంటివాడు తనతో వర్క్ చేయడం వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. తనకి అన్నగా అండగా ఉంటాను. నారా రోహిత్ నా స్నేహితుడు. చిన్నప్పుడు నుంచి మా అనుబంధం ఉంది. ఫ్యామిలీ గా ఫ్రెండ్ గా అది కొనసాగుతూ ఉంది.
2016లో ఒక్కడు మిగిలాడు అనే సినిమా తీశాను. ఆ సినిమాకి రోహిత్ వాయిస్ ఇచ్చారు. ఆ సినిమాతో ఆపాను. మళ్లీ తిరిగి వస్తుంటే నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది. నారా రోహిత్ గారు సాయి గారి పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. అందరికీ ఈ సినిమా గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను. నా జీవితంలో ఎన్ని జరిగినా ఆ శివుడు ఫ్యాన్స్ రూపంలో వచ్చాడు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకి మాత్రం నా కట్టే కాలే వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయిని. అది ఎవరు మార్చలేరు. ఎన్ని జన్మలెత్తినా మీరే నా తండ్రి మీ దీవెనలు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. భైరవ 30 తారీఖున రిలీజ్ అవుతుంది. సినిమా గొప్ప హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను.