Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్‌కు నాకూ ల‌వ్ లేదు - పూజా హెగ్గే

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (17:56 IST)
Pooja Hegge
రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప్ర‌భాస్‌, పూజా హెగ్గే జంట‌ను చూసి వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఏర్ప‌డింద‌ని కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. ఇది ముంబైలో కూడా జ‌రిగింద‌ట‌. ఇదే విష‌యాన్ని ర‌క‌ర‌కాలుగా యూబ్యూబ్‌ల‌లో క‌థ‌నాలు రాసేస్తున్నారు. దీనిపై పూజా మంగ‌ళ‌వారంనాడు క్లారిటీ ఇచ్చింది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ, నా గురించి, ప్ర‌భాస్ గురించి ఏవోవో రాసేస్తున్నారు.
 
రాధేశ్యామ్ ప‌రంగా మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఆ విష‌యం నేనే చెబుతున్నా. సినిమా చూస్తే మీరు అదే ఫీల్ అవుతారు. సినిమా చూస్తే కెమిస్టీ హైలైట్‌గా వుంటుంది. అంతేకానీ ల‌వ్ అనేది లేదు. త‌ను గొప్ప ఆర్టిస్టు. అయితే ముంబైలో వుండ‌గా కొంద‌రు అభిమానులు ప్ర‌భాస్ సోలో ఫొటో అడిగితే ఆయ‌న ప‌క్క‌కు వెళ్ళి ఫోటోకు ఫోజ్ ఇస్తున్నారు. నేను ప‌క్క‌నే అటు వెన‌క్కు తిరిగి వున్నా. అంతే.. నా ఫొటో తీసి ర‌క‌ర‌కాలుగా వార్త‌లు అల్లేశారు. ఆ త‌ర్వాత కొద్దిసేపు అటూ ఇటూ తిరిగాను. అది కూడా పెద్ద వార్త అయింది. తిరిగి వ‌చ్చిన ప్ర‌భాస్ టిఫిన్ చేద్దామా! అని అడిగారు. అంతే.. కూల్ చేయ‌డానికి టిఫిన్‌కు తీసుకెళ్ళాడంటూ ఏదో రాసేశారు. ఆ త‌ర్వాత ఇవ‌న్నీ చూశాక నాకే న‌వ్వొచ్చింది అంటూ తెలిపింది.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments