నటి శ్రద్దదాస్ తన లుక్‌తో యూత్‌ను కల్విస్తుంది. తరచుగా సోషల్ మీడియాలో తన గురించిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈసారి తన పుట్టినరోజు అయిన మార్చి 4న ఈ లుక్‌తో అలరించింది. ఈ లుక్‌కు ఆమె ఫాలోవర్స్ చాలా నాటీగా స్పందించారు. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మరెవరూ లేని విధంగా మమ్మల్ని అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నామంటూ కొందరు పోస్ట్ చేశారు.
ఆరడుగుల ఎత్తు వుండే శ్రద్దాదాస్ కారేటే బ్లాక్ బెల్ట్ కూడా. ఇలాంటి కథతో సినిమా చేయాలనుందని గతంలో చెప్పింది. కానీ ఆమెకు గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయి. డార్లింగ్, నాగవల్లి వంటి పెద్ద సినిమాలు చేసినా ఆమె ఆ తర్వాత వెనుకడుగు వేసింది.
ఇప్పటి భామలు తనకంటే బాగా నటిస్తున్నారనీ, గ్లామర్ పాత్రలు పోషిస్తున్నారని కామెంట్ కూడా చేసింది. కరోనా కాలంలో నిరీక్షణ, అస్త్రం వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాతు ఆమె కెరీర్ అంతగా లేదు. తాజాగా రెండు భాషల్లో రాబోతున్న ఓ భారీ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.