Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలో "రాధేశ్యామ్" రిలీజ్ ట్రైలర్ విడుదల

Advertiesment
త్వరలో
, బుధవారం, 2 మార్చి 2022 (15:39 IST)
ప్రభాస్, పూజా హెగ్డేలు జంటగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". ఈ చిత్రం ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ పీరియాడికల్ డ్రామ్ చిత్రం ట్రైలర్‌ను చిత్రం బృందం బుధవారం విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు, టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 
 
గత 1970 కాలం నాటి ప్రేమకథతో ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణంగా పూజా హెగ్డే నటించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్, ఖేడ్‌కేర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనాక్షి వేలికి రింగ్ తొడిగిన సల్మాన్ ఖాన్!?