వారి దగ్గరే ఎదిగాను. వారే సినిమా రిలీజ్ చేయడం ఎమోషనల్ గా ఉంది : సప్తగిరి

దేవీ
శనివారం, 15 మార్చి 2025 (17:34 IST)
Sapthagiri, Annpurnamma and others
సప్తగిరి హోల్సమ్ ఎంటర్ టైనర్ 'పెళ్లి కాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.

దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.  ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది.
 
ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ, సినిమా కోసం మాకు మేము ఒక ఎగ్జామ్ రాసుకున్నాం. నా మనస్సాక్షిగా 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఆడియన్స్ నుంచి అదే ఆశిస్తున్నాను. సినిమా చాలా బావొచ్చింది. మార్చి 21న మీరంతా సినిమా చూసి జెన్యూన్ గా రివ్యూ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇందులో నా క్యారెక్టర్ మురళి గౌడ్ క్యారెక్టర్స్ లో ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. ఈ సినిమా మంచి ఫన్ బ్లాస్ట్ గా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడ కూడా రాజీపడకుండా సినిమాని చాలా గ్రాండ్ గా  నిర్మించారు. టీజర్ లాంచ్ చేసిన ప్రభాస్ అన్నకి థాంక్యూ సో మచ్. మా ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు. ఒరిజినల్ పెళ్ళికాని ప్రసాదు వెంకటేష్ గారు కాబట్టి ఆయన నన్ను ఆశీర్వదించి సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకున్నారు. దిల్ రాజు, శిరీష్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా, యాక్టర్ గా ఎదిగాను. ఇప్పుడు వారి బ్యానర్లో సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా,ఎమోషనల్ గా ఉంది' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments