Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

డీవీ
గురువారం, 23 జనవరి 2025 (15:05 IST)
Venkatesh 230+ club
అగ్ర కథానాయకుడిలో వెంకటేష్ ఒకరు. ఆయన ఏ సినిమా చేసినా అది ఫెయిల్ అయినా ప్లాప్ అయినా పెద్దగా పట్టించుకోడు. అస్సలు దాని గురించి ఆలోచించను. తర్వాత ఏమి చేయాలో అలోచిస్తానంటూ ప్రతిసారీ ఇంటర్వ్యూలో ఆయన ఇదే చెబుతుంటారు. కానీ ఫస్ట్ టైమ్ సినిమా గురించి ఆ సినిమా ప్రమోషన్ గురించి ఎక్కువగా ప్లాన్ చేయడం విశేషం. అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ సినిమా షూటింగ్ నుంచే వెంకటేష్ కు ఆ దేవుడు మంచి సైన్ ఇచ్చాడట. అందుకే చాలా హుషారుగా సినిమా చేశాడు.
 
ఈరోజు ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసినప్పుడు వెంకటేష్ మాట్లాడారు. ఇప్పుడు తెలుగు సినిమా పాన్ వరల్డ్ అయిపోయింది. వేలకోట్ల క్లబ్ కు రావాలని మీకు అనిపించలేదా? అన్న ప్రశ్నకు... నాకు అంత కోరిక లేదు. దేవుడు నాకు ఇచ్చింది చాలు. అదే తీసుకుంటాను. అంతకుమించి నేను ఎక్కువగా అడగను. అస్సలు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. దేవుడు నీకు ఇది చాలు ఇచ్చింది తీసుకో అన్నాడు. అందుకే మనకు పెద్ద పెద్ద ఆశలు లేవు. ఒకవేళ మీరన్నట్లు వేల కోట్ల క్లబ్ లో వుండాలనుకుంటే అప్పుడు చూద్దాం. అంటూ  క్లారిటీ ఇచ్చాడు.
 
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 230 కోట్ల ప్లస్ లో చేరింది. ఈ సంతోషాన్ని పంచుకుంటూ ఆయన మాట్లాడారు. అనిల్ రావిపూడి కథ చెప్పినప్పుడు బాగా అనిపించింది. అందుకే ఆయన ఏది అవసరం అంటే అదే చేశాను. బుల్లిరాజు పాత్ర గురించి చెప్పారు. ఓకే.. మీ ఇష్టం నా పాత్ర ఎక్కువ తక్కువ గురించి ఆలోచించవద్దు అని కూడా అన్నానని వెంకటేష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా చూసొచ్చాక నా భార్య తన తాళి తీసి ముఖాన కొట్టింది, చంపి ముక్కలు చేసా: భర్త వాంగ్మూలం

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

నేపాల్‌లో కుర్చీ మడత పెట్టి పాటకు అమ్మాయిల డాన్స్ స్టెప్పులు (video)

భార్యను నగ్నంగా వీడియో తీసి స్నేహితుడికి పంపాడు.. ఆ తర్వాత మత్తుమందిచ్చి...

మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

తర్వాతి కథనం
Show comments