Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మైండ్ ఎప్పుడెలా వుంటుందో చెప్ప‌లేనుః విజ‌య్‌దేవ‌ర కొండ‌

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (18:43 IST)
Vijaydevara Konda
అర్జున్ రెడ్డితో ఒక్క‌సారిగా యూత్ ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర‌గంట కొక‌సారి ఏదో ఒక‌టి తింటాడ‌ట‌. ఇప్పుడు స‌మ్మ‌ర్ కాబ‌ట్టి స్వీట్ మేంగోస్ అంటే ఇష్టం. అలాగే దుస్తులు ఎప్పుడు ఎలా వేసుకుంటానో నా బాడీ, మైండ్ ను బ‌ట్టి ఆధార‌ప‌డి వుంటుంది. ఒక్కోసారి చాలా లూజ్ దుస్తులు ధ‌రిస్తారు. మ‌రొక‌సారి జ‌ప‌నీస్ స్ట‌యిల్‌లో వుంటాను. ఇక నా హెయిర్ స్ట‌యిల్ కూడా అర్జున్ రెడ్డి నుంచి లైగ‌ర్ వ‌ర‌కు చాలా మారిపోయింది. ఇప్పుడు దాన్ని క‌వ‌ర్ చేయ‌డానికి త‌ల‌పై క్లాత్ పెట్టుకుంటాను. ఒక్కోసారి షేవ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఎలా వుందో అంటూ త‌న హెయిర్‌ను స్ల‌యిలిష్ గా చూపించాడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. అంతేకాదు మోడీ పెట్టిన జ‌న‌తా క‌ర్ ఫ్యూ వ‌ల్ల ఇంటిలో వుంటున్నాను. అలా అని ఒంట‌రిగా వుండ‌డంలేదు. అంటూ, ప‌లు ప్ర‌శ్న‌కుల స‌మాధానాలు ఇచ్చారు. 
 
ఈ విష‌యాల‌ను టైమ్స్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. "హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్" గా మూడో సారి ఎంపికయ్యారు. ఇది మరే టాలీవుడ్ స్టార్ కు దక్కని అరుదైన రికార్డ్. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఏటా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. స్టార్ డమ్, టాలెంట్, ఆడియెన్స్ లో క్రేజ్ ఆధారంగా ఈ జాబితా తయారు చేస్తుంది. 
 
తాజాగా రిలీజ్ చేసిన "హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020" లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ. సెల్ఫ్ మేడ్ హీరోగా తనకు తానుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగిన విజయ్ ...'పెళ్లి చూపులు',  'అర్జున్ రెడ్డి', 'టాక్సీవాలా', 'గీత గోవిందం'..ఇలా వరుస సూపర్ హిట్స్ తో స్టార్ హీరోగా టాలీవుడ్ లో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'లైగర్' విజయ్ బాక్సాఫీస్ స్టామినాను, స్టార్ డమ్ ను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments