Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను గర్భవతిని కాదు.. పెళ్లి చేసుకుంటావా? : నటి తాప్సీ

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (10:51 IST)
బాలీవుడ్ నటి తాప్సీ. మనసులో ఉన్న ఏ విషయమైన బోల్డ్‌గా చెప్పేస్తుంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పనిలోపనిగా వైరల్ కూడా అయ్యాయి. దీంతో సోమవారం ఆమె తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తాప్పీ క్యూట్‌గా సమాధానమిచ్చింది. "నువ్వు పెళ్లెపుడు చేసుకుంటావు?" అని ఆ అభిమాని సూటిగా ప్రశ్నించాడు. 
 
దీనికి తాప్సీ కూడా తనదైనశైలిలో ఆన్సర్ చెప్పింది... "సో నా పెళ్లి ఎపుడు అని అంటారా? ప్రస్తుతమైతే నేను ప్రెగ్నెంట్ కాదు. కాబట్టి ఇపుడిపుడే పెళ్లి లేనట్టే. నీవు పెళ్లి చేసుకుంటావా?" అంటూ ఠక్కున బదులిచ్చి, పగలపడి నవ్వారు. ఆమెతో పాటు ఆమె అభిమానులు కూడా కడుపుబ్బా నవ్వుకున్నారు. 
 
కాగా, తాప్పీ కొన్ని సంవత్సరాలగా బ్యాడ్మింటన్ కోచ్ మథాయస్ బోయీతో రిలేషన్‌లో ఉంది. ఖాళీగా ఉన్నపుడల్లా తన ప్రియుడు, ఆయన సోదరితో కలిసి హాలీడు ట్రిప్పులకు వెళుతుంటారు. ఇటీవలే సుధీర్ఘ హాలీడే ట్రిప్పును ముగించుకుని తాప్పీ స్వదేశానికి వచ్చింది. పైగా, ఇటీవలి కాలంలో ఆమె ఎక్కువగా హాలిడే ట్రిప్పులతో ఎంజాయే చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments