బట్టతలను దాచి విగ్గు ధరించి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తికి చుక్కలు కనిపించాయి. వధువు కుటుంబీకులు వరుడికి దేహశుద్ధి చేశారు. బీహార్‌లోని గయా జిల్లాలోని ఇక్బాల్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇక్బాల్‌పూర్‌కు చెందిన ఓ యువకుడికి అక్కడి దోబీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజౌరా గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది.
అనంతరం వధూవరులు వేదికపైకి వచ్చారు. వేడుకలో, వరుడు సంప్రదాయబద్ధంగా 'సెహ్రా' అనే తలకవచాన్ని ధరిస్తాడు. అందుకు తగ్గట్టుగానే తలపాగా వేసుకునేందుకు ప్రయత్నించగా.. విగ్గు పెట్టుకుని పెళ్లి విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తేలింది.
దీన్ని చూసిన వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మండిపడ్డారు. ఆవేశంతో ఊగిపోయారు. వరుడిపై దాడి చేశారు. విగ్గు పెట్టి మోసం చేస్తారా అంటూ మండిపడ్డారు. వరుడు తనను క్షమించమని వేడుకున్నాడు. అంతేగాకుండా ఆ వరుడికి ఇదివరకే పెళ్లయిందని, మొదటి పెళ్లిని దాచిపెట్టి రెండో పెళ్లికి సిద్ధమైనట్లు కూడా తేలింది.
దీంతో కోపోద్రిక్తులైన వధువు కుటుంబీకులు అతనిపై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.