Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిరా వాయిస్‌కు నేను ఫ్యాన్‌ను త్వ‌ర‌లో తెలుగులో ఎంట్రీ

Pawan Kalyan
Webdunia
గురువారం, 27 మే 2021 (13:29 IST)
Akhira nandan
ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ త‌న కుమారుడు అఖిరా నంద‌న్‌ను గురించి కొన్ని విశేషాలు తెలియ‌జేసింది. అఖిరా తెలుగు మాట‌లు ప‌ట్టి ప‌ట్టి మాట్లాడుతుంటాడు. అవి విన‌డానికి చాలా ముద్దుగా వుంటాయి. నేను అఖిరా వాయిస్‌కు బిగ్ ఫ్యాన్ అంటూ రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా గ‌త కొంత‌కాలంగా అఖిరాను సినిమాల్లోకి తీసుకురావాల‌నేది త‌న కోరిక‌గా వ్య‌క్తం చేసింది. ఈ విష‌యాన్ని త‌ర‌చూ త‌న సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ఇత‌ర విష‌యాలు షేర్ చేసుకుంటున్న‌ప్పుడు ప్ర‌స్తావ‌న వ‌చ్చేది. తాజాగా ఆమె త‌న సోష‌ల్‌మీడియాలో అభిమానుల‌తో ఇట్రాక్ట్ అయింది.
 
రేణుదేశాయ్ న‌టి మాత్ర‌మే కాదు. మ‌రాఠీలో ద‌ర్శ‌కురాలు, ఎడిట‌ర్‌, నిర్మాత కూడా. సినిమారంగంలో కొన్ని శాఖ‌ల‌లో ప‌ట్టువుంది. క‌నుక అఖిరా నంద‌న్‌ను ముందుగా తెలుగు తెర‌కే ప‌రిచ‌యం చేస్తాన‌ని అభిమానుల‌తో షేర్ చేసుకుంది. ఎప్పుడూ అంటూ అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌కు ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తుంది. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొంద‌రు ప్రాణాలు పోతాయేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. ప్ర‌తివారూ జాగ్ర‌త్త‌గా వుండాలి. ఇలాంటి ప‌రిస్థితుల‌లో అఖిరాను ప‌రిచ‌యం చేయ‌డం స‌రైందికాదు. క‌రోనా స‌ద్దుమ‌ణిగాక త‌ప్ప‌కుండా అఖిరా మీ ముందుకు వ‌స్తారు. మీరంతా ఆశీర్వించాల‌ని అని పేర్కొంది. దీనికి వారంతా శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా, ఇటీవ‌లే రేణుదేశాయ్ క‌రోనా పేషెంట్ల‌ను ఆదుకుంటాన‌ని సోష‌ల్‌మీడియాలో పేర్కొని త‌న‌వంతు సాయంగా చేస్తాన‌ని ప్ర‌క‌టించింది కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments