Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకిప్పుడు 50 ఏళ్లు, ఈ వయసులో పెళ్లా?: 'శ్రీమంతుడు' తల్లి షాక్

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (16:53 IST)
సెలబ్రిటీలు అంటే చాలు. ఏదో ఒక గాలి కబురు పుట్టించడం మామూలే. తాజాగా శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబుకి తల్లిగా నటించిన సుకన్యపైన ఓ వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోందని. ఈ వార్తపై సుకన్య షాక్ తిన్నట్లు చెప్పారు.
 
తన వయసు ఇపుడు 50 ఏళ్లనీ, ఈ వయసులో తను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే... వారు తనను అమ్మ అని పిలవాలా... లేదా అమ్మమ్మా అని పిలవాలా అంటూ చెప్పుకొచ్చారు. 2002 సంవత్సరంలో శ్రీధరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సుకన్య అమెరికా వెళ్లారు. ఐతే అదే యేడాది అతడితో విడాకులు తీసుకుని ఇండియాకి వచ్చి స్థిరపడ్డారు. ఇక అప్పట్నుంచి అడపాదడపా పాత్రలు పోషిస్తూ సినిమాల్లో రాణిస్తున్నారు. ఐతే తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి.
 
ఈ వార్తలపై సుకన్య ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఐతే తను పెళ్లి చేసుకోబోనని మాత్రం చెప్పలేదు. దీన్నిబట్టి నిజంగానే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CBN Is Our Brand: చంద్రబాబు ఓ బ్రాండ్.. నారా లోకేష్ దావోస్ పర్యటన

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి : మంత్రి భరత్‌కు సీఎం వార్నింగ్!!

పరందూరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కావాల్సిందే.. కానీ రైతులకు అండగా ఉంటాం...

Pawan Kalyan : కాపు సామాజిక వర్గానికి 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments