Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనూ రోజూ స్టూడెంట్‌గానే ఫీలవుతాను : విశ్వక్‌సేన్‌

Webdunia
మంగళవారం, 16 మే 2023 (17:43 IST)
Bellamkonda Ganesh, Viswaksen, Avantika
‘స్వాతిముత్యం’ తో  అరంగేట్రం చేసిన  హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్ థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ  ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ పై మంచి అంచనాలు నెలకొల్పగా, ఫస్ట్ సింగిల్‌ కి కూడా మంచి ఆదరణ లభించింది. నేడు `ఒకటే ధ్యాస` సాంగ్ ను రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో యంగ్‌ ఎనర్జిటిక్‌ హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు. 
 
 అనంతరం  విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, నేనూ రోజూ స్టూడెంట్‌గానే ఫీలవుతాను. ఈ టైటిల్‌ విన్నప్పుడు కాలేజీ రోజులు గుర్తుకు వచ్చేవి. ఏదైనా తింగరి పని చేసి పోలీసులకు దొరికినప్పుడు నేను స్టూడెండ్‌ సార్‌ అనేవాడిని. టీజర్‌ లుక్‌చాలా ప్రామిసింగ్‌గా వుంది. నిన్న నాంది సతీష్‌గారు వచ్చి ఆహ్వానించారు. ఆయన చెప్పిన కంటెంట్‌ నచ్చింది. నేనూ పార్ట్‌ కావాలని ఈరోజు వచ్చాను. ఇంకో కారణం బెల్లంకొండ గణేష్‌. మే మిద్దం జుంబ్లా క్లాస్‌కు వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత జిమ్‌లో కలిశాం. గణేష్  కాంటెపరరీ కథలతో వస్తున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌. రచయిత కృష్ణ చైతన్య కూడా దర్శకత్వం చేస్తున్నాడు. ఇందులో పాట రాసిన హర్ష కూడా మా సినిమాలో లవ్‌ సాంగ్‌ రాశాడు. సాగర్‌ అమేజింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు. 
 
బెల్లంకొండ గణేష్‌ మాట్లాడుతూ, ఈరోజు సాంగ్‌ చూశారు. ఫోన్‌ కొనడానికి కష్టపడుతూండగా వచ్చే మోన్‌టేజ్‌ సాంగ్‌ ఇది. చాలా ఎంజాయ్‌ చేసేలా వుంటుంది. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని సినిమాలుచేసే విశ్వక్‌ అంటే ఇష్టం. తన నుంచి చాలా నేర్చుకోవాలి. పదేళ్ళనాడు తనను కలిసినప్పుడు చాలా క్లాస్‌ గా వుండేవాడు. అలాంటిది దాస్‌కామాస్‌ అంటూ మారిపోయాడు. జూన్‌2న మా  సినిమా విడుదలవుతుంది. తప్పకుండా చూడండి అని అన్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments