Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక పంచ్ వేసిన ఆది.. స్కిట్ అదిరేలా వుంది... ప్రోమో రిలీజ్

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (11:30 IST)
మెగా డాటర్ నిహారిక గురించి అందరికీ తెలిసింది. హీరోయిన్‌గా, యాంకర్‌గా ఆమెకు పనిచేసిన అనుభవం వుంది. ఇక ఆ తర్వాత నిహారిక పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలయింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ మళ్లీ బిజీ అయిపోయింది. 
 
ప్రముఖ ఛానల్‌లో ప్రసారమయ్యే ఢీ అనే డ్యాన్స్ షో ద్వారా నిహారిక యాంకర్‌గా ఎంతోమంది ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా నిహారిక బుల్లితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో పాల్గొంది. వచ్చేవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో మెగా స్టార్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నారు. 
 
తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. నిహారిక రావడంతోనే బర్త్డే సెలబ్రేషన్ మా పెదనాన్నకి సరిపోయే రేంజ్‌లో ఉన్నాయో లేదో చూద్దామని వచ్చాను అని ఓ డైలాగ్ వేసింది.. షో లో భాగంగా నిహారిక హైపర్ ఆది కలిసి ఒక స్కిట్ వేశారు. ఆ స్కిట్‌లో నువ్వు దాదా నేను ఏటీఎం అని హైపర్ ఆది అన్నాడు.
 
దానికి నిహారిక అందరూ నిన్నే దాదా అని పిలుస్తారు కదా ఇప్పుడు నన్ను దాదా అని పిలుస్తున్నావేంటి అని ఓ పంచ్ వేసింది. ఆ తర్వాత ఆది నేను హీరోగా చేస్తున్నాను అని అంటే.. నువ్వు హీరో అయితే నేను పాన్ ఇండియా మూవీ‌లో నటిస్తున్నానని నిహారిక అంటోంది. 
 
జోక్ బాగుందే అని నిహారికపై ఓ పంచ్ చేసాడు ఆది.. ఇక ఆ తర్వాత ఆది.. నేను భీమ్లా నాయక్ సినిమాలో ఓ సాంగ్ చేశాను. అది మామూలుగా లేదు అని అన్నాడు. దానికి నిహారిక మాట్లాడుతూ.. ఇలా వచ్చి అలా వెళ్లి పోతే కూడా దాన్ని గొప్పగా చెప్పుకుంటారా అని సెటైర్ వేసింది. దానికి ఆది.. నువ్వు సైరా నరసింహారెడ్డిలో చేసిన దానికంటే నేను చేసింది ఎక్కువలే అంటూ నిహారిక పరువు మొత్తం తీసేసాడు. దీంతో నిహారిక పక్కకు వెళ్లి మరీ నవ్వుకుంది. ఈ విధంగా హైపర్ ఆది తన పంచులతో నిహారికపై ఎన్నో సెటైర్లు వేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments