Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్‌పై హైపర్ ఆది కామెంట్స్.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సైనా?

hyper aadi
, సోమవారం, 11 జులై 2022 (12:08 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి హాస్య నటుడు హైపర్ ఆది కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ అంటే తనకు ఎందుకు అమితమైన ఇష్టమో వెల్లడించారు. సాధారణంగా డబ్బు ఎంతటి వ్యక్తినైనా మార్చేస్తుందన్నారు. కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో ఇది బద్ధ వ్యతిరేకమన్నారు. 
 
తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో హైపర్ ఆది మాట్లాడుతూ, 'పవన్‌ కల్యాణ్‌ అంటే నాకు అమితమైన ఇష్టం. ఆయన మంచి మనిషి. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ కోసం నేను చిన్నవర్క్‌ చేస్తున్నా. అందులో భాగంగా ఇటీవల ఓ నాలుగు రోజులు ఇంటికి వెళ్లి పర్సనల్‌గా పవన్‌ని కలిశా. 
 
ఆయనెంత గొప్ప మనిషో అప్పుడు మరింత అర్థమైంది. ఇప్పుడున్న రోజుల్లో ఎలాంటి వ్యక్తినైనా డబ్బు మార్చేస్తోందనే విషయం మనకు తెలుసు. ఆయనకు మాత్రం డబ్బు అంటే అస్సలు ఆసక్తి లేదు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచిస్తాడు. సినిమాల నుంచి వచ్చిన సొమ్ముని కౌలు రైతులకు సాయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. 
 
ఒక సినిమా చేస్తే సుమారు రూ.50 కోట్లు వస్తే ఆ మొత్తాన్ని పేదలకు సాయం చేయడానికి, పార్టీ కార్యకలాపాలకు, పార్టీ కోసం పనిచేస్తోన్న వారికి పంచేస్తారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. అందరి మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరిగితే మనం ఎంతో సంతోషిస్తాం కదా. ఆయనపై నా భావన కూడా అదే' అని ఆది తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమానా? లైఫా? ఏది ఇంపార్టెంట్ అన్న ప్ర‌శ్న ఆలోచించేలా చేసింది - హీరో రామ్