ఆ వేషం వేయనంటూ మొండికేసిన హైపర్ ఆది... వేయకపోతే ఏం చేస్తామో చూడు...

బుల్లితెర నటుల్లో జబర్దస్త్ హైపర్ ఆదికి చాలా క్రేజ్ ఉంది. జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది టీంను ఏవిధంగా ప్రేక్షకులు ఆదరిస్తారో చెప్పనవసరం లేదు. ఈ మధ్య జబర్దస్త్ కార్యక్రమంలో ఆది స్కిట్ ఎప్పుడు వస్తుందా అని తెగ ఎదురుచూస్తున్నారు తెలుగు టివి ప్రేక్షకు

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (16:04 IST)
బుల్లితెర నటుల్లో జబర్దస్త్ హైపర్ ఆదికి చాలా క్రేజ్ ఉంది. జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది టీంను ఏవిధంగా ప్రేక్షకులు ఆదరిస్తారో చెప్పనవసరం లేదు. ఈ మధ్య జబర్దస్త్ కార్యక్రమంలో ఆది స్కిట్ ఎప్పుడు వస్తుందా అని తెగ ఎదురుచూస్తున్నారు తెలుగు టివి ప్రేక్షకులు. జబర్దస్త్‌లో రచయితగా వచ్చిన ఆది, కొద్దికాలంలోనే టీం లీడర్ స్థాయికి చేరుకున్నాడు. ఈ షోలో నాన్‌స్టాప్ పంచ్‌లు వేసేది ఒక్క హైపర్ ఆది మాత్రమే. ఆదికి రైజింగ్ రాజు కూడా తోడవటంతో వీరి స్కిట్స్‌కి ప్రజాదరణ పెరిగింది.
 
అంతకుముందు వరకు జబర్దస్త్ వీక్షకులు చమ్మక్ చంద్ర స్కిట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు హైపర్ ఆది స్కిట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. చంద్ర కన్నా ఆది స్కిట్‌లే బాగున్నాయని నిర్వాహకులే చెబుతున్నారు. ఇటీవల హైపర్ ఆదికి, జబర్దస్త్ నిర్వాహకులకు మధ్య గొడవ జరిగిందట. జబర్దస్త్ కార్యక్రమంలో ఉండే టీం లీడర్లు అవసరాన్ని బట్టి ఆడవేషం వేసినవారే... కానీ ఆది మాత్రం తనదైన స్టైల్‌లో లుంగీలో రావడం తప్ప ఆడవేషం మాత్రం వేయలేదు. 
 
హైపర్ ఆది ఆడవేషం వేస్తే బాగుంటుందని నిర్వాహకులు చెబుతుంటే ఆది మాత్రం ఆ క్యారెక్టర్ నేను అసలు చేయనంటూ తెగేసి చెబుతున్నాడు. దీంతో నిర్వాహకులకు, హైపర్ ఆదికి మధ్య గ్యాప్ పెరిగిందట. ఆడ వేషం నాకు వేసే ఆలోచనే లేదు.. నేను వేయను కూడా... మీరు నన్ను ఇబ్బందిపెడితే జబర్దస్త్ షో మానేస్తానంటున్నారట హైపర్ ఆది. కాగా ఆది మరీ మొండికెస్తే ఏం చేయాలో తమకు తెలుసునని నిర్వాహకులు చెపుతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments