జబర్దస్త్ నవ్వుకోవడానికే...లాజిక్స్ కోసం వెతకొద్దు: అనసూయ
						
		
						
				
జబర్దస్త్ షోలో అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాధలు అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అనాధ పిల్లలపై ఆయన చేసిన కామెంట్స్‌ని అనాధ విద్యార్ధులు సీరియస్‌గా త
			
		          
	  
	
		
										
								
																	జబర్దస్త్ షోలో అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాధలు అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అనాధ పిల్లలపై ఆయన చేసిన కామెంట్స్‌ని అనాధ విద్యార్ధులు సీరియస్‌గా తీసుకుని హైపర్ ఆది టీమ్‌పై, యాంకర్ అనసూయపై, జడ్జిలపై కేసు నమోదు చేశారు. హైపర్ ఆది చేసిన కామెంట్స్ విని మనో వేదనకు గురయ్యామని అనాథ ఆశ్రమంలోని విద్యార్థులు అన్నారు. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు యాంకర్ అనసూయ, జడ్జిలు పగలబడి నవ్వుతున్నారు. తమపై చేసిన కామెడీతో నవ్వు ఆపుకోలేక వాళ్ళు అలా నవ్వారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆది ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాలని.. అనాథ పిల్లలను ప్రభుత్వానికి సొంతమని చెప్పుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
	 
	అయితే ఈ వ్యవహారంపై జబర్దస్త్ యాంకర్ అనసూయ ఫైర్ అయ్యింది. తెలుగు సినీ పరిశ్రమకు 'బాహుబలి' ఎలాంటిదో, టీవీ ఇండస్ట్రీకి 'జబర్దస్త్' అలాంటిదేనని చెప్పుకొచ్చింది. ఫేస్‌బుక్‌లో అభిమానులతో లైవ్ చాట్ చేసిన అనసూయ.. జీవితంలో వచ్చే అన్ని అంశాలపై తాము షోలో చూపిస్తున్నామని.. నవ్విస్తున్న వాళ్లను ఏడిపించడం ఏమైనా బాగుందా అంటూ ప్రశ్నించింది.
	 
	సమస్యల గురించి ఆలోచిస్తే క్రియేటివిటీ పోతుందని.. జబర్దస్త్ షోలో లాజిక్స్ కోసం చూడకుండా నవ్వుకోవాలని సూచించింది. ఇలాంటి అంశాలను ఇష్యూ చేయడం కంటే పరిష్కరించాల్సిన చాలా సమస్యలను పట్టించుకుంటే మంచిదని సూచించింది. క్రియేటివిటీని చంపేయవద్దని ఫేస్ బుక్ మాధ్యమంగా అనసూయ కోరింది. 
	 
	స్కిట్ ప్రకారం అలా రాసుకోవాల్సి వచ్చిందని.. అంతేగానీ ఎవరినీ కించపరిచేందుకు కాదని వివరణ ఇచ్చింది. ఇలాంటి విషయాలను పక్కనబెట్టి మాట్లాడుకోవాలంటే, అమ్మాయిలపై రేప్‌లు, విద్య, రహదారులు వంటి పరిష్కారం కానీ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని అనసూయ సూచించింది. అంతేకానీ వినోదాన్ని పండించే జబర్దస్త్ షోను ఎందుకు హైలైట్ చేస్తున్నారని ప్రశ్నించింది.