Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైపర్ ఆదికి ఆ అమ్మాయితో డుం డుం డుం..?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (15:09 IST)
హైపర్ ఆది ఎవరంటే ఆయన జబర్ధస్త్ యాక్టర్ అని అందరూ టక్కున చెప్పేస్తారు. జబర్ధస్త్ షోలో కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి ఈ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీలైనపుడల్లా.. మెగా హీరోలపై అభిమానం చూపిస్తూనే ఉంటాడు. జబర్ధస్త్ షోలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి స్క్రిప్ట్ రైటర్‌గా తన సత్తా చూపాడు.
 
జబర్ధస్త్‌లో హైపర్ ఆది వేసే పంచ్‌లకు సామాన్య ప్రేక్షకులే కాదు.. సినిమా సెలబ్రిటీలు కూడా ఆయనకు అభిమానులుగా మారారు. సినిమాల్లో కూడా వరుసగా కమెడియన్‌ వేషాలు వేస్తున్నాడు. కానీ ఎందుకనో సినిమాల్లో హైపర్ ఆది పంచ్‌లు అంతగా పేలడం లేదు.
 
ఆ సంగతి పక్కన పెడితే.. హైపర్ ఆది త్వరగా పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిలవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సమాచారం. కానీ హైపర్ ఆది మాత్రం.. తన తోటి యాంకర్స్ సుధీర్, ప్రదీప్ పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. రీసెంట్‌గా హైపర్ ఆది తన పెళ్లి విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
 
ఇప్పటికే ఢీ యాంకర్ వర్షిణితో హైపర్ ఆది ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైపర్ ఆదికి ఇంట్లో వాళ్లు సంబంధాలు చూసారట. అంతేకాదు అమ్మాయికి కూడా ఫిక్స్ అయిందట. వాళ్ల చుట్టాలమ్మాయినే హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. 
 
ఇప్పటికే మాటా మంతీ కూడా అయ్యాయి. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేనందున.. మేలో లోని నిశ్చయ తాంబూలాలు చేసుకొని అదే నెలలో హైపర్ ఆది పెళ్లి చేసేలా కుటుంబ సభ్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. మొత్తంగా హైపర్ ఆది పెళ్లి డేట్ పై కుటుంబ సభ్యులు అఫీషియల్‌గా ప్రకటించడమే తరువాయి అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)

WhatsApp : వాట్సాప్‌ను నిషేధించనున్న రష్యా ప్రభుత్వం..

18 Kilometers : 200 మంది విద్యార్థులు.. 18 కిలోమీటర్లు నడిచారు..

Christmas : చంద్రబాబు, పవన్, జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

Christmas: పౌరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments