Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్ ఛానళ్లకు పెరుగుతున్న ప్రేక్షకాదరణ : బాలీవుడ్ నటి పూజా ప్రజాపతి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (20:45 IST)
ఇన్ఫోటైన్మెంట్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రముఖ బాలీవుడ్ న‌టీమ‌ణి పూజా ప్రజాపతి అన్నారు. బాలీవుడ్‌లో రోమీ, ట్రిప్ టు బ్యాచిలర్ పార్టీ, గ్రీన్‌ఫోర్స్, గుజరాతీలో ఆషికి చిత్రాలతో పాటు టాలీవుడ్‌లో మూర్ఖుడు సినిమాతో ప్రేక్షకులను అలరించిన పూజా ప్రజాపతి.. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన ప్రజ్ఞ మీడియా యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 
 
ఈ వేడుకల్లో భాగంగా ప్రజ్ఞ మీడియా నూతన సంవత్సర క్యాలెండరును ఆవిష్కరించి, సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం న‌టీమ‌ణి పూజా ప్రజాపతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోటైన్మెంట్ రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోందన్నారు. 
 
యూట్యూబ్ ఛానళ్లకు రోజురోజుకూ ప్రేక్షకాదరణ పెరుగుతోందని, అత్యున్నత నిర్మాణ విలువలతో వినూత్నమైన కార్యక్రమాలను అందించడం ద్వారా యూట్యూబ్ ఛానళ్లు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందవచ్చని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థగా పేరొందిన ప్రజ్ఞ గ్రూప్ ద్వారా ఆవిష్కరింపబడిన ప్రజ్ఞ మీడియా అనతికాలంలోనే అగ్రగామి ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ గా నిలుస్తుందని పూజా ప్రజాపతి విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
అనంతరం ప్రజ్ఞ మీడియా మేనేజింగ్ డైరక్టర్ సాయినేని లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఇన్ఫోటైన్మెంట్ రంగంలో నూతన ఒరవడిని సృష్టించేలా తమ యూట్యూబ్ ఛానల్‌ను తీర్చిదిద్దామని తెలిపారు. అద్భుతమైన నాణ్యతతో, వినూత్నమైన కార్యక్రమాలను అందించడానికి ప్రజ్ఞ మీడియా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. 
 
వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలను రూపొందించామని చెప్పారు. ఎంటర్టైన్మెంట్, సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్, కరెంట్ ఎఫైర్స్, హెల్త్, ఫిట్నెస్, లైఫ్‌స్టైల్, బ్యూటీ టిప్స్, బిజినెస్, కల్చర్, స్పిరిచ్యువల్ తదితర విభాగాలకు సంబంధించిన విభిన్న కార్యక్రమాలను ఆసక్తిదాయకంగా ప్రేక్షకులకు అందిస్తామని వివరించారు. 
 
ప్రజ్ఞ మీడియా చీఫ్ ఎడ్వైజర్లు చెరుకూరి రవిశంకర్, పీవీఎస్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజ్ఞ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా సరికొత్త ఇన్ఫోటైన్మెంట్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఏడేళ్ల అనుభవంతో ప్రజాభిమానాన్ని చూరగొన్న ప్రజ్ఞ గ్రూప్, మీడియా రంగంలోనూ విశిష్టతను చాటుకుంటుందని చెరుకూరి రవిశంకర్, పీవీఎస్ వర్మ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments