రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో రంగారెడ్డి జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లి సమీపంలో ఓ ఫాం హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
విత్తన డీలర్ల కోసం ఎరువుల కంపెనీక చెందిన ప్రభాకరరెడ్డి అనే వ్యక్తి ఈరేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో 6 మంది యువతులతో పాటు మరోక 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కీసర సీఐ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు, వీరిని కోర్టులో హజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.