Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్ని వర్గాల కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం : శ్రీనివాస్ గౌడ్

Advertiesment
Telangana Minister Srinivas Goud
, మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:48 IST)
గౌడ్ హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ, తెలంగాణ గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జి.హెచ్.ఎం.సి ఎన్నికలో విజయం సాధించిన గౌడ్ కార్పొరేటర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖమంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నర్సయ్య గౌడ్, మాజి మంత్రివర్యులు, ఛైర్మన్ ఆర్థిక శాఖ రాజేశం గౌడ్, టీఎస్ఈడబ్లుఐడిసి ఛైర్మన్ నాగేందర్ గౌడ్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం, ఆత్మగౌరవం తీసుకరావాలని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారని, గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ (Neera Policy)ని తూసుకువచ్చారని టిఆర్ఎస్ ప్రభుత్వం గౌడ్ కుల అభివృద్ధికి పాటుపడుతుందని తెలిపారు.
 
ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ.శ్రీనివాస్ గౌడ్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్‌ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి నూతన గౌడ్ కార్పొరేటర్లు సతీష్ గౌడ్, సభాఅధ్యక్షులు అమరవేణి నర్సా గౌడ్,ముద్దాగౌని రామ్మోహన్ గౌడ్, సురేష్ గౌడ్, బలరాం గౌడ్, రాములు గౌడ్, దర్గా చిన్న గౌడ్ తదితులున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తరకం వైరస్.. దేవినేని ఉమ ట్వీట్