Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపండమ్మా మీ గోల... అక్కాచెల్లెళ్లకు ఝలక్ ఇచ్చిన హృతిక్ రోషన్

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (18:59 IST)
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ''ఎక్స్'' అనే పదం వాడి హృతిక్‌పై విమర్శలు గుప్పిస్తూ వచ్చింది కంగనా రనౌత్.


ఆపై కంగన సోదరి కూడా హృతిక్‌కు సపోర్ట్ చేసే వారిని ఏకిపారేసింది. ఈ వివాదం కొన్ని రోజులు సద్దుమణిగినా.. తాజాగా మళ్లీ హృతిక్ కంగనా సోదరిల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి. 
 
తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్ మధ్య తమ కొత్త సినిమాల విడుదల తేదీల విషయంలో వివాదం నెలకొంది. హృతిక్ నటిస్తున్న'సూపర్ 30', కంగన 'మెంటల్ హై క్యా' సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవబోతుండడం.. ఈ వివాదానికి ఆజ్యం పోసింది. దీనిపై కంగనా సోదరి రంగోలీ స్పందించింది.
 
'మా అక్క నీ కొవ్వు కరిగిస్తుంది, ఆమె జోలికి వస్తే ఖబడ్దార్'.. అంటూ హృతిక్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా రంగోలీ వ్యాఖ్యలపై హృతిక్ స్పందించాడు. ట్విట్టర్‌‍లో ప్రెస్ నోట్ విడుదల చేశాడు.
 
మీడియా ఓవరాక్షన్ చేస్తుందని.. మీడియో వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నానని.. వేధింపులు తాళలేకపోతున్నానని.. ఆ టార్చర్ భరించలేక తన 'సూపర్ 30' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉన్నానని, ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా రిలీజ్ డేట్ చేంజ్ చెయ్యమని నిర్మాతలకు చెప్పాను. గత కొద్దికాలంగా తనను పరోక్షంగా వేధిస్తున్న కొంతమందిని చూసి చప్పట్లు కొడుతూ, వారిని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని తాను చూస్తున్నాను. సొసైటీ పట్ల నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలపై అందరికీ అవగాహన రావాలి. 
 
ఆ అవగాహన ఎప్పుడొస్తుందా అని ఇప్పటికీ ఓపికగా ఎదురు చూస్తున్నాను.. ఇలాంటి నిస్సహాయ పరిస్థితులకు ముగింపు పలకాలి' అంటూ, అక్కా, చెల్లెళ్ళకి హృతిక్ రోషన్ సలహా ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments