Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధమ్కీ లో విశ్వక్ సేన్ కు ఆల్మోస్ట్ పడిపోయిన నివేదా పేతురాజ్ ఎలా?

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (17:33 IST)
Vishwak Sen, Niveda Pethuraj
డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన 'దాస్ కా ధమ్కీ' థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
 
ఫస్ట్ సింగిల్ 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల' లిరికల్ వీడియోకు భారీ స్పందన రావడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. తాజాగా వీడియో సాంగ్‌ని విడుదల చేయడం ద్వారా మేకర్స్ ఫుల్ ఫీస్ట్‌ను  అందించారు.  లియోన్ జేమ్స్ లైవ్లీ బీట్‌లతో పెప్పీ నంబర్‌ని స్కోర్ చేశాడు.  పాట కోసం ఫారిన్ లోకేషన్స్ లోషూట్ చేసిన స్టైలిష్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదిత్య ఆర్కేఎనర్జిటిక్ గా పాడగా, పూర్ణా చారి సాహిత్యం ఆకట్టుకుంది.
 
విశ్వక్ సేన్ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌లతో మెస్మరైజ్ చేశాడు. నివేదా పేతురాజ్ ఈ బీచ్‌సైడ్ సాంగ్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చక్కగా ఉంది. పూర్తి వీడియో సాంగ్‌లోలీడ్ పెయిర్ అద్భుతమైన కెమిస్ట్రీతో 'ఆల్ మోస్ట్ పడిపోయిందే' చాలా ఆకర్షణీయంగా వుంది.  
 
వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం.  ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments