షాంపైన్ పార్టీ చేసుకున్న నాని, అడవి శేష్
, శుక్రవారం, 2 డిశెంబరు 2022 (19:06 IST)
హిట్ 2 సినిమా ఈరోజే విడుదలైంది. మర్డర్, మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా విశ్వక్ సేన్ నటించిన హిట్‌కు సీక్వెల్. దీనికి నాని నిర్మాత. శుక్రవారమే విడుదలైన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ నెలకొంది. కొన్నిచోట్ల పాజిటివ్ టాక్ వుంది. ఐమాక్స్ థియేటర్లలో కొందరు చెప్పే రివ్యూలను చూసి ఆనందిస్తూ వివిధ జిల్లాలనుంచి రిపోర్టలను తీసుకుని చిత్ర యూనిట్ ఈరోజు సాయంత్రం నాని కార్యాలయంలో పార్టీ చేసుకున్నారు.
ఈ సందర్భంగా నాని, శేష్ మాట్లాడుతూ, చంపేశాం, థియేటర్‌లో హిట్ 2 బంపర్ హిట్ అంటూ ఆనందంతో కేకలు వేశారు. కాగా, ఈ సినిమాలో ముగింపులో నాని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా దర్శనమిస్తాడు. దీనిని కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో సూర్య వచ్చినట్లుగా కంపేర్ చేసుకుంటూ ఆ సినిమాతో పోల్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నాని సోదరి, బావ, చిత్ర దర్శకుడు శైలేష్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
తర్వాతి కథనం