Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయవాడ కేంద్రంగా సెక్స్ స్కామ్ : టీడీపీ నేత బొండా ఉమ

Advertiesment
bonda uma
, శుక్రవారం, 2 డిశెంబరు 2022 (15:29 IST)
విజయవాడ కేంద్రంగా సెక్స్ స్కామ్ జరిగిందని, ఇందులో మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల పాత్ర ఉందని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఇటీవల విజయవాడలో సంకల్పసిద్ధి స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ స్కామ్‌లో చాలామంది పెద్దల పాత్ర ఉందన్నారు.
 
ఈ కుంభకోణంలో వంశీ, ఆయన అనుచరుడి పాత్రను బయటపెట్టాలని కోరారు. విజయవాడలో సెక్స్ స్కామ్ జరిగిందన్నారు. కాలేజీ విద్యార్థినులను వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సెక్స్ స్కామ్ వెనుక కూడా వైకాపా పెద్దల హస్తం ఉండి ఉండొచ్చని ఆయన అన్నారు. 
 
బీసీ, దళిత సామాజికవర్గ ప్రజలను ముఖ్యమంత్రి జగన్ నమ్మించిన మోసం చేశారని బొండా ఉమ విమర్శించారు. నవరత్నాల పేరుతో రాష్ట్రానికి నవ బొక్కలు పెట్టారని ఎద్దేవా చేసారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాలను గెలుచుకుంటామని ఢంకా బజాయిస్తున్నారనీ, నిజానికి జగన్‌కు అంత దమ్మూధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని బొండా ఉమ సవాల్ విసిరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లండన్‌లో వర్టికల్ ఫార్మింగ్.. గంటల్లో తాజాగా సలాడ్స్ చేసుకోవచ్చు..