అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఈ చిత్రాన్ని ఏప్పిల్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మోనిష్ పత్తిపాటి మాట్లాడుతూ, దర్శకుడు చాణిక్య చిన్న నాకు నెరేట్ చేసినప్పడు చాలా కొత్తగా అనిపించింది. హారర్ కామెడీ జానర్ లో ఇప్పటికే చాలా సినిమాలు విడుదలైనప్పటికీ ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తుందనే నమ్మకంతో మా చిత్ర బృందం భావిస్తున్నాము. ఈ సినిమాలో హీరో అదిత్ అరుణ్, పూజీత పొన్నాడ పేయిర్ లవ్లీగా ఉండనుంది. అలానే ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఈ సినిమాకే మెయిన్ హైలెట్. ఏప్రిల్ భారీ రేంజ్ లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని తెలిపారు.
దర్శకుడు చాణక్య చిన్న మట్లాడుతూ, కథ కంచికి మనం ఇంటికి స్టోరీ ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. అదిత్ అరుణ్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ కథ హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. మొత్తం సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు.