Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి గారి అభిమానిని- సినిమాల మీద ఇష్టం పెరిగి నిర్మాత అయ్యాః అర్జున్ దాస్యన్

Advertiesment
చిరంజీవి గారి అభిమానిని- సినిమాల మీద ఇష్టం పెరిగి నిర్మాత అయ్యాః  అర్జున్ దాస్యన్
, బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:14 IST)
Arjun Dasyan
`నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత సినిమాల మీద ఇష్టం పెరిగి నిర్మాత అవ్వాలని పరిశ్రమకు వచ్చాను. సినిమా నిర్మాణ సంస్థ పెట్టాలని అనుకున్నప్పుడు రెండేళ్లు ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాను. మన పరిశ్రమలో ఉన్న వాళ్లతో ట్రావెల్ చేశాను. వీఎన్ ఆదిత్య గారితో పరిచయం వల్ల టాలీవుడ్ గురించి చాలా విషయాలు తెలిశాయ‌ని` డియర్ మేఘ` నిర్మాత అర్జున్ దాస్యన్ తెలియ‌జేస్తున్నారు.
 
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు థియేటర్ లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ సినిమా విశేషాలు తెలిపారు.
 
- ఇది నా మొదటి సినిమా. నేను పుట్టింది నిర్మల్. పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశాను. లండన్ లో వర్క్ చేశాను. హైదరాబాద్ లోనూ వర్క్ చేశాను. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  జరుగుతోంది. డియర్ మేఘ నా రెండో సినిమా అవ్వాలి కానీ వీఎన్ ఆదిత్య గారి సినిమా ఆలస్యమై ఇది మొదటి సినిమాగా వస్తోంది.
 
- డియర్ మేఘ ఒక లవ్ స్టోరి. ఫీమేల్ కోణంలో సాగుతుంది. స్టోరీ ఎక్కువగా రివీల్ చేయలేను. మంచి టెక్నికల్ టీమ్ ఉంది. హైదరాబాద్, ముంబై,గోవా లో షూట్ చేశాం. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. హరి గౌర మ్యూజిక్ కు చాలా పేరొచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలకు మంచి పేరొచ్చింది. నాలుగో పాట రిలీజ్ చేస్తున్నాం.
 
- ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరి. మేఘ అనే క్యారెక్టర్ కోణంలో సినిమా సాగుతుంది. అబ్బాయి లవ్ స్టోరిలు చాలా చూసి ఉంటాం. కానీ ఇది మేఘ అనే అమ్మాయి పర్సెప్షన్ లో కొత్తగా ఉంటుంది. ఆండ్రూ గారి సినిమాటోగ్రఫీ వల్ల త్వరగా షూట్ చేయగలిగాం. కొవిడ్ టైమ్ లో షూటింగ్ చేసినా మా యూనిట్ వాళ్లకు ఎవరికీ కొవిడ్ రాలేదు.
 
- థియేటర్ లలో సినిమాకు ఆదరణ బాగానే ఉంటోంది. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి చిత్రాన్ని సక్సెస్ చేశారు. మా తొలి సినిమా కాబట్టి, డియర్ మేఘను థియేటర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నాం. డబ్బు కంటే మాకు సినిమా అంటే ప్యాషన్ అందుకే ధైర్యంగా థియేటర్ లో విడుదల చేయబోతున్నాం.
 
- ఇది మిలటరీ స్టైల్ లో చేసిన సినిమా డియర్ మేఘ. ప్రొడక్షన్ సైడ్ ఖర్చు పెరగకుండా చూసుకున్నాం. మేఘా ఆకాష్ మెచ్యూర్డ్ పర్మార్మెన్స్ చూపించింది. అర్జున్ సోమయాజులు తెలుగు బ్యాక్ గ్రౌండ్ ఉన్న అబ్బాయే. ఆదిత్ అరుణ్ కు దక్కాల్సిన పేరు ఇంకా రాలేదని అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం.
 
- వీఎన్ ఆదిత్య సినిమా తర్వాత పెద్ద హీరోతో ఓ సినిమా అనౌన్స్ చేయబోతున్నాం.  డియర్ మేఘ ఫైనల్ అవుట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఆ దైర్యంతోనే థియేటర్ లలో డియర్ మేఘను రిలీజ్ చేయబోతున్నాం.
 
- నాకు అన్ని రకాల సినిమాలు ఇష్టం. ఈ జానర్ లోనే సినిమాలు నిర్మించాలని అనుకోవడం లేదు. మార్వల్ స్టోరీస్ నుంచి షార్ట్  ఫిలింస్ దాకా అన్నీ చూస్తాను. బాగున్నంత వరకు ఆ కంటెంట్ ఏంటి అనే తేడాలు చూడను. సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలనే గట్టి నిర్ణయంతోనే టాలీవుడ్ లో అడుగుపెట్టాను. కష్టమైనా సుఖమైనా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. చాలా మంది కొత్త దర్శకులు, రచయితలు నన్ను అప్రోచ్ అవుతున్నారు. కొత్త కథలు వింటున్నాం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయహో ఇండియన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్