Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినోదం క‌ర్మ‌సిద్ధాంతం క‌లిగలిపిన - రాజ రాజ చోర‌

వినోదం క‌ర్మ‌సిద్ధాంతం క‌లిగలిపిన - రాజ రాజ చోర‌
, గురువారం, 19 ఆగస్టు 2021 (10:50 IST)
Raja Raja Chora
న‌టీన‌టులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి తదితరులు
 
సాంకేతిక‌తః సినిమాటోగ్రాఫర్ : వేదారమన్ శంకరన్, సంగీతం : వివేక్ సాగర్, నిర్మాత : టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: హసిత్ గోలి.
విడుదల తేదీ : ఆగస్టు 19, 2021
 
శ్రీవిష్ణు హీరోగా చేసిన సినిమా ‘రాజ రాజ చోర’. హసిత్ గోలి దర్శకత్వం వ‌హించారు. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సినిమాపై త‌ప‌న‌తో ద‌ర్శ‌క‌త్వం చేప‌ట్టిన ఈ ద‌ర్శ‌కుడు జంథ్యాల‌, కె.విశ్వ‌నాథ్ వంటి ద‌ర్శ‌కుల స్పూర్తితో తాను ఈ రంగంలోకి వ‌చ్చాన‌ని ప్ర‌క‌టించాడు. తెలుగులోనూ సాహిత్యంలోనూ మంచి ప‌ట్టున్న ఈ యువ ద‌ర్శ‌కుడు చేప‌ట్టిన సినిమానే ఇది. ఇందులో మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
 
భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ జిరాక్స్ షాప్ లో పని చేస్తుంటాడు. త‌న అవ‌స‌రాలు తీర‌క దొంగ‌త‌నాలు కూడా చేస్తుంటాడు. ఆ డ‌బ్బును త‌నను ప్రేమిస్తున్న‌, తాను ప్రేమిస్తున్న సంజన ( మేఘా ఆకాశ్)కు ఇస్తుంటాడు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అని ఆమెకు చెబుతాడు. ఈమెకూడా సేమ్‌టుసేమ్‌. ఇద్ద‌రూ అబద్దాల‌తో గ‌డిపేస్తుండ‌గా ఓసారి భాస్క‌ర్‌కు కొడుకు వున్నాడ‌ని సంజ‌న‌కు తెలుస్తుంది. భాస్క‌ర్ మ‌ళ్ళీ అబ‌ద్దం ఆడి నా భార్య చ‌నిపోయిందంటాడు. ఆ త‌ర్వాత నాట‌కీయ ప‌రిణామాలు జ‌రిగి సంజ‌న అస‌లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాదు ఓ షాప్‌లో సేల్స్‌గ‌ళ్ అని తెలుసుకుంటాడు భాస్క‌ర్‌. ఆ త‌ర్వాత త‌ను ప్రేమిస్తున్న అబ్బాయి ఇత‌నే అని భాస్క‌ర్‌ను త‌న మేన‌మామ ఎస్‌.ఐ. రవిబాబుకు సంజ‌న ప‌రిచ‌యం చేస్తుంది. అప్ప‌టికే  దొంగ అయిన భాస్క‌ర్ గురించి తెలిసిన ర‌విబాబు అత‌ను గూర్చి పూర్తిగా చెప్పేస్తాడు. ఆ త‌ర్వాత‌ ర‌విబాబు  గురించి తెలిసిన సీక్రెట్ భాస్క‌ర్ చెప్పే త‌రుణంలో క‌థ ఓ మ‌లుపు తిరుగుతుంది. అది ఏమిటి? అలాగే రాజు గెట‌ప్‌ భాస్క‌ర్ ఎందుకు ధ‌రించాడ‌నేదికూడా మిగిలిన సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 
విశ్లేష‌ణః
 
ద‌ర్శ‌కుడు హ‌సిత్ గోలి ఎంచుకున్న అంశం. వాల్మీకి రామాయ‌ణంలోని వాల్మీకి క‌థ‌. అత‌ను దొంగ‌త‌నాలు చేస్తూ చివిరికి రామాయ‌ణం రాసే వాల్మీకిగా ఎలా మారాడ‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అందుకే ఈ అంశాన్ని తీసుకుని ఆ పాత్ర‌లో శ్రీ‌విష్ణుకు ఆపాదించాడు. క‌థ ప్రారంభం ఓ గుడిలో త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ఆథ్యాత్మిక బోధ‌న చేసే క్ర‌మంలో ప్రారంభ‌మ‌వుతుంది. ముగింపు కూడా చాక‌చ‌క్యంగా అలానే ముగించాడు. మాన‌వుడు తెలిసో తెలియ‌కో త‌ప్పులు చేస్తాడు. దానికి శిక్ష అనేది ఎప్ప‌టికైనా అనుభించాల్సిందే. ప‌రివ‌ర్త‌న చెందేదిశ‌గా ప్ర‌య‌త్నించాలి. అదే ద‌ర్శ‌కుడు ఈ సినిమా ద్వారా చెప్పాడు. చెప్పే విధానం కూడా సూక్ష్మంగా అదుపు త‌ప్ప‌కుండా చేయ‌డం విశేషం. 
 
ఇక సంభాష‌ణ‌లు, సాహిత్యం, సంగీత‌ప‌రంగా ఆయ‌న‌కున్న ప‌ట్టుతో ద‌ర్శ‌కుడు బాగా వెలివేట్ చేయ‌గ‌లిగాడు. అచ్చ‌మైన తెలుగుపదాలు దొర్లించాడు. ఇక పాత్ర‌ప‌రంగా ఆయ‌న ఎన్నుకున్న‌ న‌టీన‌టులు బాగా న‌ప్పారు. శ్రీవిష్ణు గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో మంచి కామెడీ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు  ఒక ప‌క్క లవ్ సీక్వెన్స్ లో అలాగే మిగిలిన కామెడీ సీన్స్ లో కూడా శ్రీవిష్ణు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మేఘా ఆకాశ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. సునైన సీరియస్ రోల్ లో అయిన లాయ‌ర్ కావాల‌నే త‌ప‌న‌తో ఆమె చేసిన విధానం భ‌ర్త‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నంలో బాగా న‌టించింది.గంగవ్వ కూడా తన నటనతో మెప్పించింది. ఇక సినిమాలోని మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. 
 
మొద‌టి భాగం సరదాగా నడిచింది. అలాగే సెకండాఫ్ లో మంచి మెసేజ్ ఇస్తూ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసాడు. మొత్తానికి దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే అలాగే కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బావుంది.
 
ఇక సినిమాలో మొద‌టి భాగం స‌ర‌దాగా సాగినా రెండవ భాగం మాత్రం ర‌విబాబు స‌న్నివేశాల‌తో క‌థ‌ను మ‌రోవైపు తీసుకెళ్ళింది. అందుకే నెమ్మ‌దిగా సాగిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ దిశ‌లో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. ఇక్క‌డ ఎమోషనల్ ట్రాక్ కి సంబంధించి మ‌రింత హృద్యంగా వుంటే బాగుండేది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే, ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకే బాగా ప్లస్ అయింది. ఇక ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
ఇది హాయిగా న‌వ్వుకునే సినిమా అయినా కామ‌న్‌మేన్‌కు చ‌క్క‌టి సందేశం కూడా వుంది. ఏదో కొత్త ద‌ర్శ‌కుడు సినిమా తీశాడు అనేది లేకుండా ఓ ప‌ర్‌ప‌స్‌తో సినిమా తీసిన‌ట్లుంది. ఇందులో చాలా పాత్ర‌లు మ‌న‌కు ఎక్క‌డో చోట క‌నిపించేవిగా వుంటాయి.  సినిమా మంచి ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది.
 
రేటింగ్ః 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నీరు పెట్టిన చమ్మక్ చంద్ర, ఏమైంది?