Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్రర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం `ఇది నాది`

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (15:36 IST)
Didi nadi opening
శివ ప్రియ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్,మైఖేల్, అమృతా హెల్డర్, పూజ పప్పిడియా హీరో, హీరోయిన్లుగా బి.యల్ ప్రసాద్ దర్శకత్వంలో బి.భూలక్ష్మి నిర్మిస్తున్న ఫ్యామిలీ హర్రర్ కథా చిత్రం "ఇది నాది".ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టగా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ కంచం సత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ నిర్మాత బుల్లెట్ రవి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
 
అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సినిమారంగంలో మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చిన భూ లక్ష్మి గారికి ఇండస్ట్రీ తరుపున ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ మధ్య నిర్మాతలు కొత్త  దర్శకులకు అవకాశం కల్పిస్తున్నందున చిన్న సినిమాలు పెద్ద విజయం సాధిస్తున్నాయి. అలాగే శివ ప్రియ ప్రొడక్షన్ లో భూలక్ష్మి కొత్త దర్శకుడికి అవకాశం కల్పించారు. మంచి కథతో మన ముందుకు వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించి ఇండస్ట్రీలో మరిన్ని మంచి చిత్రాలు నిర్మించి పెద్ద నిర్మాతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.
 
చిత్ర నిర్మాత భూ లక్ష్మి మాట్లాడుతూ.. చిన్నతనం నుండి సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం.సినిమా తీయాలనే డ్రీమ్ తో రియల్ ఎస్టేట్ రంగం వైపు వెళ్లి అక్కడ రాణించి "ప్లానింగ్" సినిమాకు సహా నిర్మాతగా మారి ఆ సినిమాను విడుదల చేసి మంచి పేరు తెచ్చుకొన్నాను. ఆ చిత్ర అనుభవంతో శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్ ను స్థాపించాను.దర్శకుడు నాకు  చెప్పిన  కంటెంట్ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను. డిఫరెంట్ కథతో వస్తున్న ఫ్యామిలీ హారర్ ఎంటర్టైనర్ ఈ చిత్రం అన్నారు. 
 
చిత్ర దర్శకుడు బి.యల్.ప్రసాద్ మాట్లాడుతూ, ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ ఫార్మెట్ల కు భిన్నంగా కొత్త కథను ఎంచుకొని ప్రేక్షకులకు డిఫరెంట్ ఉండాలని ఫ్యామిలీ, హారర్ ఎంటర్టైనర్ తో మీ ముందుకు వస్తున్నాము. మేము తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. నాకిలాంటి మంచి కథను ప్రేక్షకులకు అందించే అవకాశం కల్పించిన నిర్మాతకు ధన్యవాదాలు అని అన్నారు 
 
తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కంచన్ సత్యనారాయణ మాట్లాడుతూ,. రియల్ ఎస్టేట్ రంగం నుండి సినిమా రంగంలోకి వచ్చిన భూలక్ష్మి గారు తను తీస్తున్న "ఇది నాది" సినిమా పెద్ద విజయం సాధించి తనకు మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నానని అన్నారు. 
 
నిర్మాత బుల్లెట్ రవి మాట్లాడుతూ, భూలక్ష్మి గారు గ్లామర్ ఫీల్డ్ లోకి నిర్మాతగా ఎంటరైనందుకు చాలా ఆనందంగా ఉంది , మంచి కథను ఎన్నుకొని తీసిన ప్రతి సినిమా విజయం సాధించాయి. అలాంటి సినిమాల కోవలో ఈ సినిమా ఉండాలని  కోరుకుంటున్నానని అన్నారు. 
హీరోయిన్లు అమృతా హెల్డర్, పూజ పప్పీడియ మాట్లాడుతూ ..మాకు తెలుగులో ఇది మొదటి సినిమా ఇలాంటి మంచి హర్రర్ చిత్రంలో నటించే  అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు  వనం, విన్నర్ ట్రిప్ చిత్రాల దర్శకుడు తెలుగు శ్రీను మాట్లాడుతూ.. ఇలాంటి లేడీ ప్రోడ్యూసర్స్ సినీ ఇండస్ట్రీ కి ఏంతో అవసరం తాను చేస్తున్న రెండవ సినిమాలో నాకు అవకాశం కల్పించ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ లో ఎన్నో చిత్రాలు నిర్మించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఉదయ్ కిరణ్ యు.కె., సతీష్ ముదిరాజు,  తదితరులు మాకీ అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments