Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన హాలీవుడ్ న‌టుడు లుకాస్ బ్రావో

డీవీ
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (13:36 IST)
Lucas Bravo - Ram Charan
ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌కు జీవం పోసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌కు ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కులే కాదు.. హాలీవుడ్ సెల‌బ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. గ్లోబ‌ల్ స్టార్ న‌ట‌ను ఎందో హాలీవుడ్ యాక్ట‌ర్స్ ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ యాక్ట‌ర్ లుకాస్ బ్రావో కూడా ట్రిపులార్‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌ను ప్ర‌శంసించారు.

ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ స‌మయంలో ఇండియ‌న్ సినిమాల్లో మీకు నచ్చిన న‌టుడు గురించి చెప్ప‌మ‌ని అడిగిన‌ప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూశాన‌ని చెప్పిన లుకాస్ బ్రావో. "RRR లో ఇద్దరు ప్రధాన పాత్రలు పోషించారు. అందులో ప్రధాన పాత్ర పోషించిన రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడు. అతను చేసే విన్యాసాలు మరియూ తెరపై ఎమోషనల్ ప్రెజెన్స్ అనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అని పేర్కొన‌టం విశేషం.
 
ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి ఆస్కార్ అవార్డును తెచ్చిన సినిమా మ‌న తెలుగు సినిమా.. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది. ఈ చిత్రంలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌గా, తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించారు. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 1200 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments