Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్‌కు బానిసై దొంగతనాలు చేస్తున్న హాలీవుడ్ నటుడు

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (12:24 IST)
వ్యసనం అనేది ఎంతటివారినైనా పాతాళానికి ఎలా తొక్కేస్తుందో ఈ హాలీవుడ్ నటుడిని చూస్తే తెలిసిపోతుంది... అందులోనూ ఆ వ్యసనం డ్రగ్స్‌కి సంబంధించినదైతే ఎంతటి దారుణాలైనా చేయించేస్తుంది. సరిగ్గా ఇదే పరిస్థితి హాలీవుడ్ నటుడు, సింగర్ జోసెఫ్ గేడోస్‌ను చిక్కుల్లోకి నెట్టేసింది. 
 
2003వ సంవత్సరంలో భారీ హిట్ సాధించిన హాలీవుడ్ మ్యూజికల్ చిత్రం ‘స్కూల్ ఆఫ్ రాక్’లో కీలకపాత్ర పోషించిన జోసెఫ్.. కొంతకాలం తర్వాత సొంత బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దానిపై సరిగా దృష్టిపెట్టలేకపోయాడు. అదే సమయంలో అతనికి డ్రగ్స్ అలవాటయ్యాయి. ఆ దురలవాటుకి బానిసైపోయి సొంత ఇంట్లోనే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. 
 
ఆ తర్వాత దగ్గరలోని మ్యూజిక్ స్టోర్లలో గిటార్ల వంటివి దొంగలించడం మొదలెట్టాడు. ఇలా చాలా చోట్ల దొంగతనాలు చేసిన జోసెఫ్‌ను సీసీ ఫుటీజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు అతనిపై దొంగతనం కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. 
 
డ్రగ్స్ అలవాటు వల్లే తాను దొంగగా మారానని, తనకు ట్రీట్‌మెంట్ తీసుకోవాలని ఉందని అతను కోరినట్లు సమాచారం. స్కూల్ ఆఫ్ రాక్‌లో ప్రముఖ నటుడు బ్లాక్‌జాక్‌తో స్క్రీన్‌ని పంచుకున్న జోసెఫ్ ఇలా అయిపోయినందుకు అతని తండ్రి, స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments