హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న చిత్రం చిత్రం `నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా`.వెంకట్ వందెల దర్శకత్వంలో జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన మూడవ సాంగ్ హే పోరి నా పోరి అంటూ హీరో తేజ కూరపాటి టీజింగ్ సాంగ్ ని ప్రముఖ హీరో సుమన్ చేతుల మీదుగా విడుదల చేసారు.
ఈ సందర్బంగా సుమన్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ ని చూసాను, చాలా ఎనర్జిగా వుంది. యూత్ టీజింగ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఈ సాంగ్ మరోక్క మంచి ఆల్బమ్ గా నిలుస్తుంది. ఈ చిత్రం లో ఏమి కావాలో అన్ని అంశాలు వుంటాయానేది తెలుస్తుంది. హీరో తేజ చాలా ఎనర్జి గా డాన్స్ వేశాడు అలాగే అఖిల చాలా అందంగా కనిపించింది. ఈ చిత్రం ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మల్లేటి నాగేశ్వరావు, నిర్మాతలు ముల్లెటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేఖమైన శుభాకాంక్షలు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కొరుకుంటున్నాను. అని అన్నారు
దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా హీరో తేజ మంచి ఎనర్జి తో నటించారు. ఈ సాంగ్‌లో డాన్స్ చేశారు. ఆయన నటించిన గత చిత్రాలకంటే ఆయన లుక్స్ ఈ చిత్రం లో ఆకర్షస్తాయి. ఈ చిత్రం లో యూత్ కి ఏమి కావాలో అన్ని వుంటాయి. హీరొయిన్ అఖిల చాలా అందంగా వుంటుంది. అంతేకాదు పాత్ర కి తగ్గట్టుగా తను పాత్రలో ఇమిడిపోయింది. రొమాంటిక్ సాంగ్ లో యువత హ్రుదయాల్ని దొచుకుంటుంది. ప్రేమ కథ తో వినొదాన్ని మిక్స్ చేసి ఈ కథని తెరక్కించాము. ఇది మ్యూజికల్ ఎంటర్‌టైనర్ గా మంచి విజయాన్ని సాధిస్తుంది. మా చిత్రం లో మూడవ సాంగ్ ని విడుదల చేశాము. విలక్షణ నటుడు సుమన్ గారు చేతుల మీదుగా విడుదల చేశాము. టీజింగ్ సాంగ్ అందర్ని ఆకట్టుకుంటుది. సుమన్ గారికి ప్రత్యేఖమైన ధన్యవాదాలు అని అన్నారు.
నిర్మాత ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ.. తేజ్ కూరపాటి, ఆఖిల ఆకర్షణ ఈ సాంగ్ లో చాలా ఎనర్జిగా చేశారు, అంతేకాదు చాలా అందంగా కనిపిస్తారు. ఈ జంట అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మా చిత్రం సాంగ్ ని సుమన్ గారు లాంచ్ చేయటం మా యూనిట్ కి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకి మా చిత్ర యూనిట్ తరుపున ప్రత్యేఖ దన్యవాదాలు తెలుపుతున్నాము. అని అన్నారు.