Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లకు కమిట్ మెంట్స్ వుండవు : అనన్య నాగళ్ల

డీవీ
శనివారం, 26 అక్టోబరు 2024 (16:13 IST)
Ananya Nagalla
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన రెవల్యూషనరీ బ్లాక్ బస్టర్ 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, విమర్శకులు ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
 
ఈ సందర్భంగా అనన్య నాగళ్ల ఓ మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు, మీరు పొరపడుతున్నారు. కమిట్ మెంట్స్ అనేవి హీరోయిన్లకు వుండదు. కథ, బేనర్ నచ్చితేనే సినిమాలో నటించడానికి ఎవరైనా అంగీకరిస్తారు. మీ ద్రుక్పథాన్ని మార్చుకోండని ఘాటుగా స్పందించింది.
 
ఇంకా చిత్రవిజయాన్ని గురించి మాట్లాడుతూ... సినిమాకి ప్రేక్షకులు నుంచి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం. మేము ఊహించిన దాని కంటే చాలా గొప్పగా రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కి ఆడియన్స్ వచ్చి ఇంత సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్ ఆడియన్స్. ధియేటర్స్ 100% ఫీల్ అయ్యాయి. ఒక చిన్న సినిమాకి ఈ మధ్య కాలంలో ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు. సాహిత్ ఒక అద్భుతమైన కథని చాలా గొప్ప గా మలిచాడు. చూసినకొద్ది చూడాలనిపిస్తుంది. 
 
నా రోల్ గురించి చాలా మంది ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ బుజ్జమ్మ అని పిలుస్తుంటే చాలా ఆనందంగా వుంది. నిర్మాతలు చాలా పాషన్ తో సినిమా చేశారు. యువ చాలా అద్భుతంగా నటించారు. అందరికీ థాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా రావాలి. మాత్రుదేవో భవ సినిమాకి ఎలా కనెక్ట్ అయ్యారో ఈ సినిమాకి కూడా అలానే కనెక్ట్ అవుతారు. అందరూ వచ్చి ఈ సినిమాని థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలి' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూ వివాదం.. జేసీబీ కింద బిడ్డలతో పడుకున్న మహిళలు... ఎక్కడ? (video)

నాలుగేళ్ల చిన్నారిపై తండ్రి స్నేహితుడు అత్యాచార యత్నం

దళితులపై హింస-98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు

నాగ్‌పూర్‌-‘దృశ్యం’: ప్రియురాలిని చంపి, పాతిపెట్టి దానిపై కాంక్రీట్ నిర్మాణం, ఈ నేరం ఎలా వెలుగులోకి వచ్చింది?

మరణం ఒక్క క్షణం, ఆశయ సాధన శాశ్వతం: అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి

చింతకాయలు వచ్చేసాయి, ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

తర్వాతి కథనం
Show comments