Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి వస్తాను... కానీ చంద్రబాబుపై పోటీ చేయను : హీరో విశాల్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (09:38 IST)
తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని, అయితే ఎపుడు వస్తానన్న విషయంపై తనకు క్లారిటీ లేదని హీరో విశాల్ అన్నారు. అదేసమయంలో ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తాను వైకాపా తరపున పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను కుప్పంలో పోటీ చేయడం లేదని, ముఖ్యంగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు సార్‌పై అస్సలు పోటీ చేయనని తేల్చి చెప్పారు. 
 
తన కొత్త చిత్రం "లాఠీ" చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఆదివారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, తనకు కుప్పానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తన తండ్రి గ్రానైట్ వ్యాపారం చేసే సమయంలో తాను అక్కడే మూడేళ్ళపాటు ఉన్నానని చెప్పారు. కుప్పంలోని ప్రతి వీధి, ప్రతి ఒక్కరు తనకు బాగా తెలుసని ఆయన చెప్పారు. ఈ వివరాలన్నింటిని పక్కాగా సేకరించి తాను పోటీ చేయనున్నట్టు పుకార్లు సృష్టించారని తెలిపారు.
 
పైగా తనకు చెన్నై ఎలాగో కుప్పం కూడా అలాంటిదేనని చెప్పారు. అక్కడ పోటీ చేసే ఉద్దేశ్యంలేదన్నారు. అదేసమయంలో తాను రాజకీయాల్లోకి వస్తానని, తన ప్రవేశించే సమయంపై ఓ క్లారిటీ లేదన్నారు. అదే సమయంలో రాజకీయాల్లోకి మాత్రం తప్పకుండా వస్తానని చెప్పారు. సామాజిక సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఇందుకోసం ఇన్ని రాజకీయ పార్టీలు అక్కర్లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments