Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలను ఎందుకు కనడం లేదంటే... హీరో వరుణ్ సందేశ్ భార్య వివరణ

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (15:11 IST)
హీరో వరుణ్ సందేశ్‌ వితికా షేరును గత 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరికి పిల్లలు లేరు. అయితే, 2018లో ఒకసారి వితికాకు గర్భస్రావం జరిగినట్టు ఆమె వెల్లడించింది. ఆ తర్వాత కూడా వారికి పిల్లలు లేకపోవడంతో పలు సందర్భాల్లో దీనిపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు పిల్లలు లేకపోవడంతో వితికా షేరు స్పందించారు. 
 
'పడ్డానండీ ప్రేమలో..' అనే చిత్రం ద్వారా వరుణ్ సందేశ్, తనకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా ఏర్పడింది. ఆ తర్వాత 2016లో మేమిద్దరం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాం. అమెరికాలో స్థిరపడిపోదామని అక్కడకు వెళ్లాం. కొంతకాలం పాటు అక్కడే ఉన్నాం. 2018లో తాను గర్భందాల్చడంతో తమ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నట్టు చెప్పారు. కానీ, కొన్ని రోజులకే అబార్షన్ జరిగింది. అయితే, కొన్ని రోజుల పాటు తాము ఆ బాధలోనే ఉండిపోయామని చెప్పారు. 
 
బాధలోనే 'బిగ్ బాస్' షోలో పాల్గొన్నట్టు చెప్పారు. తనకు చిన్నపిల్లలంటే అమితమైన ఇష్టమని చెప్పారు. తాను ఎక్కడకు వెళ్లినా పిల్లలను ఎపుడు కంటారు అనే ప్రశ్న ఎదురవుతుందని, పిల్లల్ని కనకూడదని ఎవరైనా అనుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఆ మధుర క్షణం మరోమారు వస్తే ఖచ్చితంగా అందరితో పంచుకుంటానని వితికా షేరు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments