Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్‌కు ఆర్థిక సాయం చేయనున్న యువ హీరో!

Webdunia
సోమవారం, 4 మే 2020 (13:03 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ యువ హీరో నితిన్ ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఓ ప్రణాళికను రచిస్తున్నారు. అయితే, ఈ యువ హీరో చేసే ఆర్థిక సాయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా? లేదా అన్నది తేలాల్సివుంది. అసలు పవన్‌కు ఆ యువ హీరో ఎందుకు ఆర్థిక సాయం చేయాలని భావించాడో ఓ సారి తెలుసుకుందాం. 
 
పవర్ స్టార్‌కు లక్షలాది మంది వీరాభిమానులు ఉన్నారు. కానీ, హీరో నితిన్ కూడా అందులో ఒకరు. ఒక హీరోగా ఉంటూ... మరో హీరో వీరాభిమానిని నేను అంటూ ధైర్యంగా ప్రకటించారు. ఆ అభిమానంతోనే తన సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో పవన్ ప్రస్తావన తీసుకొస్తుంటాడు. అలాంటి నితిన్.. తన కారణంగా పవన్‌కి వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. 
 
గతంలో తన బ్యానర్లో నితిన్ 'ఛల్ మోహన్ రంగా' సినిమా చేశాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ నిర్మాతలు. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వలన నష్టాలు వచ్చాయి. అయితే తన కారణంగా పవన్‌కి వచ్చిన నష్టాన్ని భర్తీ చేయాలని నితిన్ భావించినట్టుగా సమాచారం. 
 
ప్రస్తుతం తను చేస్తున్న రెండు సినిమాల్లో ఒక సినిమాకి పవన్ బ్యానర్ పేరును వాడుకుని, సహా నిర్మాతగా లాభాల్లో ఆయనకి వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకు పవన్ అంగీకరిస్తాడా లేదా? అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments