Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'తమ్ముడు'కే 'అన్నయ్య' మద్దతు - తేల్చి చెప్పిన మెగాస్టార్

'తమ్ముడు'కే 'అన్నయ్య' మద్దతు - తేల్చి చెప్పిన మెగాస్టార్
, మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (14:11 IST)
మెగాస్టార్ చిరంజీవిపై ఇంతకాలం సాగుతూ వచ్చిన ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను పార్టీ మారబోవడం లేదని తేల్చి చెప్పారు. పైగా, తన మద్దతు ఎల్లపుడూ తన సోదరుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనకే ఉంటుదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై సాగుతున్న ప్రచారానికి తెరదించారు. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో విజయవాడ, తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో చిరంజీవి భేటీ అయ్యారు. ఆ సమయంలో చిరంజీవి వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో ఏకాంత చర్చల అనంతరం సీఎం దంపతులతో కలిసి చిరంజీవి దంపతులు విందు ఆరగించారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. 
 
అప్పటి నుంచి చిరంజీవి వైకాపాలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతూ వచ్చింది. దీనిపై చిరంజీవి ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఇదే అంశంపై స్పందించారు. తన మద్దతు ఎప్పటికీ జనసేనకే ఉంటుందని తేల్చి చెప్పారు. తనకు తన సోదరుడు పవన్ కళ్యాణ్, అతని పట్టుదల గురించి బాగా తెలుసని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
అంతేకాకుండా, పవన్ కళ్యాణ్‌కు రాజకీయ సలహాలు అవసరంలేదన్నారు. పైగా, సొంతగా పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు కళ్యాణ్‌కు ఉన్నాయన్నారు. అందువల్ల తన సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా జనసేన పార్టీకే ఉంటుదని చిరంజీవి తేల్చి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టును తాకిన కోవిడ్-19 వైరస్