Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుర్ర హీరోయిన్‌‌పై కన్నేసిన పవర్ స్టార్?? (video)

Advertiesment
కుర్ర హీరోయిన్‌‌పై కన్నేసిన పవర్ స్టార్?? (video)
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (13:05 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా, వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే "పింక్" రీమేక్ మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రం ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా నిర్మితం కానుంది. 'కోహినూర్' వజ్రం చుట్టూ ఈ కథ తిరగనుంది. ఆ వజ్రాన్ని చేజిక్కించుకునే దొంగగా పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు.
 
అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకి తొలుత జాక్విలిన్ - కీర్తి సురేష్‌ల పేరు తెరపైకి వచ్చాయి. ఇపుడు కొత్తగా కుర్ర పిల్ల నివేదా పేతురాజ్ పేరు వినిపిస్తోంది. ఈమె పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది.
 
నివేదా పేరును ఖరారు చేయడానికి ఓ బలమైన కారణం లేకపోలేదని అంటున్నారు. ఎందుకంటే.. నివేదా మంచి ఎత్తు. అదువల్లే పవన్ సరసన ఆమె జోడీ బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిజమైతే ఈ చిత్రం ఆమె సినీ కెరీర్‌కు మంచి హెల్ప్ అవుతుదంని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా మమ్మి మమ్మల్ని ఇంకా 'రియల్ మ్యాన్‌'లా చూడట్లేదు .. హీరో ఆవేదన