Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జ‌ర్నీ'ని మించి 'మెట్రో' బ్లాక్‌బస్టర్ కొడుతుంది : హీరో నందు

వ‌ర‌ల్డ్ సినిమాని, ఇత‌ర సినిమాల్ని మంచి క‌థ‌లు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాల‌నుకుంటున్నారు. భాష అర్థం కాక‌పోయినా పొరుగు సినిమాలు చూడాల‌ని ఆశిస్తున్నారు.

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (18:44 IST)
వ‌ర‌ల్డ్ సినిమాని, ఇత‌ర సినిమాల్ని మంచి క‌థ‌లు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాల‌నుకుంటున్నారు. భాష అర్థం కాక‌పోయినా పొరుగు సినిమాలు చూడాల‌ని ఆశిస్తున్నారు. ప్రేమిస్తే, పిజ్జా, షాపింగ్ మాల్, జ‌ర్నీ లాంటి బ్లాక్‌బస్టర్లు ప్రేక్షకులు మారిన‌ అభిరుచికి నిద‌ర్శనం. ఆ త‌ర‌హాలోనే వ‌స్తున్న మ‌రో సినిమా `మెట్రో`. `జ‌ర్నీ`ని మించి బ్లాక్‌ బస్టర్
హిట్ కొట్టే చిత్రమిది అని హీరో నందు అన్నారు. 
 
ఈ యంగ్ హీరో `మెట్రో` మూవీలో హీరో పాత్రకు డ‌బ్బింగ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `షాపింగ్‌మాల్‌`, `పిజ్జా` వంటి బ్లాక్ బస్టర్‌ను తెలుగువారికి అందించిన సురేష్ కొండేటి స‌మ‌ర్పణలో ఆర్‌-4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. 
 
ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ ట్రైల‌ర్‌కి, గీతామాధురి స్పెష‌ల్ సాంగ్‌కి ప్రేక్షకాభిమానుల్లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 23న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా... యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నందు మాట్లాడుతూ...``త‌మిళ్‌లో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన చిత్రమిది. తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్టర్స్ అందించారు సురేష్ కొండేటి. మంచి త‌మిళ చిత్రాల్ని తెలుగువారికి అందించారు.
 
ఈ సినిమాకి వెల్ నోన్, ఎస్టాబ్లిష్డ్‌ ఆర్టిస్టుల‌తో డ‌బ్బింగ్ చెప్పారు. హీరో పాత్రకు నేను డ‌బ్బింగ్ చెప్పాను. ఈ సినిమా త‌మిళ్‌ని మించి పెద్ద విజ‌యం సాధిస్తుంది. ఇలాంటి మ‌రిన్ని మంచి సినిమాల్ని సురేష్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తారు. మెట్రో జ‌ర్నీ సినిమాని మించి పెద్ద విజ‌యం సాధిస్తుంది. మీరంతా థియేట‌ర్లకు వ‌చ్చి టీమ్‌ని బ్లెస్ చేసి మంచి సినిమాని చూసి ఆనందిస్తార‌ని ఆశిస్తున్నా అని అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments