Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతో కలిసి నటిస్తే ఆ కిక్కేవేరబ్బా... యువ హీరో కార్తికేయ

Webdunia
గురువారం, 16 జులై 2020 (12:59 IST)
మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని, ఆయన పక్కన నిలబడాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అలాంటి వారిలో కొందరికే ఆయనతో కలిసి నటించే అవకాశం, మాట్లాడే ఛాన్స్ వస్తుంటాయి. అలాంటి వారిలో యువ నటుడు, 'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయకు తాజాగా దక్కింది. దానిపై కార్తికేయ స్పందిస్తూ.. చిరంజీవి పక్కన నిలబడితే ఆ కిక్కే వేరబ్బా అంటూ కామెంట్స్ చేశాడు. 
 
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించండంటూ మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ఓ వీడియో రూపంలో సందేశం ఇచ్చారు. ఇందులో ఆయన యంగ్‌ హీరో కార్తికేయతో కలిసి కనిపిస్తారు. కరోనా నేపథ్యంలో మంచి సందేశాత్మక వీడియోలో మెగాస్టార్‌తో కలిసి నటించడం పట్ల కార్తికేయ అమితానందం వ్యక్తం చేశారు.
 
కరోనా భయం నెలకొన్న వేళ, షూటింగ్‌ని మిస్ అవుతున్న సమయంలో, తర్వాత ఎలా ఉంటుందనే భయం మధ్య తీసిన ఈ ఒక్క వీడియోతో తమ భయాలన్నీ పోయాయని కార్తికేయ చెప్పాడు. 
 
ఓ మంచి పని కోసం మెగాస్టార్‌తో తాను కలిసి ఈ వీడియో చేశానని చెప్పాడు. తన సినిమాలు పది విడుదలైనా ఈ కిక్ రాదని ఆయన చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి‌తో ఇది తన జీవితకాల జ్ఞాపకమంటూ ఆయన ఈ వీడియోను ట్వీట్ చేశాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments