Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జై లవ కుశ" మరో "దాన వీర శూర కర్ణ"... మా తమ్ముడొక్కడే చేయలగలడు : కళ్యాణ్ రామ్

బాబీ దర్శకత్వంలో హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిర్మించిన చిత్రం జై లవ కుశ. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... ‘జ

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (06:18 IST)
బాబీ దర్శకత్వంలో హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిర్మించిన చిత్రం జై లవ కుశ. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... ‘జై లవ కుశ’ సినిమాను తారక్ తప్పించి ఎవరూ చేయలేరన్నారు.
 
చిత్ర దర్శకుడు బాబీ ఈ సినిమా టైటిల్‌తో సహా స్క్రిప్ట్‌ను తనకు వినిపించాడని, పదే పది నిమిషాల్లో ఓకే చేశానని అన్నారు. ఈ సినిమాను ఓకే చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ వారం రోజుల సమయం తీసుకున్నాడని, అలా ఎందుకు చేశాడో, అప్పుడు తనకు అర్థం కాలేదని, ఆ తర్వాత, తనకు అర్థమైందని అన్నారు.
 
వారం రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రతి డైలాగ్‌ను గుర్తుంచుకున్న తారక్, తనకు వినిపించాడని, దీంతో, ఈ సినిమా అంటే తారక్‌కు ఎంత ఇష్టమో తనకు అప్పుడు అర్థమైందని అన్నారు. ‘మా తాతయ్య నందమూరి తారక రామారావు గారికి "దాన వీర శూర కర్ణ" చిత్రం ఎంత పేరు తెచ్చిందో.. తమ్ముడికి ‘జై లవ కుశ’ అంత పేరు తెస్తుంది’ అని కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments