Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య‌కు బర్త్ డే స్పెషల్.. సూరరై పోట్రుకు అవార్డ్స్.. చిరు విషెస్.. జ్యోతికాకు థ్యాంక్స్

Webdunia
శనివారం, 23 జులై 2022 (11:32 IST)
Surya
త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు నిజంగానే నేడు స్పెష‌ల్ బ‌ర్త్ డే నేడు. బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న సూర్య‌కు ఒక రోజు ముందు శుక్రవారం జాతీయ ఉత్తమ న‌టుడి అవార్డు ద‌క్కింది. శుక్రవారం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో భాగంగా జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డుకు సూర్య‌ను ఎంపిక చేశారు. 
 
డెక్కన్ ఎయిర్‌వేస్ వ్య‌వ‌స్థాప‌కుడు కెప్టెన్ గోపినాథ్ బ‌యోగ్ర‌ఫీ ఆధారంగా తెర‌కెక్కిన త‌మిళ చిత్రం సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా)లో టైటిల్ రోల్ పోషించిన సూర్య‌కు ఈ అవార్డు ద‌క్కింది. 
 
శ‌నివారం సూర్య జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ బ‌ర్త్ డే మీకు నిజంగానే ప్ర‌త్యేక‌మైన‌దేన‌ని చిరు గుర్తు చేశారు.
 
పుట్టిన రోజు నాడే జాతీయ అవార్డుకు ఎంపిక కావ‌డం అరుద‌ని, అలాంటి అరుదైన అవ‌కాశం మీకు ద‌క్కిందంటూ సూర్య‌కు చిరు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ చెప్పారు.  
 
ఇదిలా ఉంటే సూర్య‌కు జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు అందించిన సూరరై పోట్రు సినిమా జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డులో స‌త్తా చాటింది. జాతీయ ఉత్త‌మ చిత్రంగా ఈ చిత్రానికి అవార్డు రాగా, ఉత్త‌మ న‌టి అవార్డు కూడా సూర్య‌కు జోడిగా న‌టించిన అప‌ర్ణ బాల‌ముర‌ళికి ద‌క్కింది.
 
ఇకపోతే.. సూరారై పోట్రు సినిమాను చేసే విషయంలో తనను ఎంతగానో ప్రోత్సహించిన తన భార్య జ్యోతికకు కూడా సూర్య స్వీట్ గా థ్యాంక్స్ చెప్పాడు. 
 
"నా జ్యోతికకు ప్రత్యేక ధన్యవాదాలు. సూరారై పోట్రు సినిమాను నిర్మించేందుకు, అందులో నటించేందుకు ఆమే నన్ను ప్రోత్సహించింది. ఇప్పటి వరకు నా కృషిని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ, మా అమ్మ, అప్ప, కార్తీ, బృందాలకు కూడా ప్రేమతో ధన్యవాదాలు" అని హీరో సూర్య పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments