Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరత్ బాబు ఆరోగ్యం విషమం : ఏఐసీ ఆస్పత్రి వర్గాల వెల్లడి

Webdunia
గురువారం, 4 మే 2023 (08:36 IST)
సీనియర్ హీరో శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 71 సంవత్సరాల శరత్ బాబుకు ఐసీయూ ప్రత్యేకవార్డులో ఉంచి చికిత్స అందిస్తుంది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు లోనైట్టు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
 
కాగా, గత మార్చి నెలలో అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. తొలుత బెంగుళూరుకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడ నుంచి మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు షికారు చేస్తున్నాయి. 
 
శరత్‌బాబు మృతి చెందినట్టు కొన్ని వెబ్‌సైట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో పలు రకాలైన వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం కూడా తెలపడంతో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని, వాటిని నమ్మవద్దని శరత్ బాబు సోదరి కోరారు. ఆయన కోలుకుని తర్వలోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments