Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HBDSudigaliSudheer సుడిగాలిలా వచ్చాడు... అలా నాటుకుపోయాడు..

Webdunia
బుధవారం, 19 మే 2021 (11:59 IST)
జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్స్ తెలుగు తెరకు వచ్చారు.. వెళ్లిపోయారు కానీ కొందరు మాత్రమే అక్కడే సెటిల్ అయిపోయారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు సుడిగాలి సుధీర్. ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూనే ఉన్నాడు. మే 19న ఈయన పుట్టిన రోజు. 1987లో పుట్టాడు సుధీర్.
 
బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న కమెడియన్స్‌లో నెంబర్ వన్ సుధీర్ అంటే అతిశయోక్తి కాదు. టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్. ఈ మధ్యే సాఫ్ట్‌‌వేర్ సుధీర్ అంటూ హీరో అయ్యాడు కూడా. మిగిలిన సినిమాల్లో కూడా చిన్నచిన్న పాత్రలు చేసాడు. 
 
ఆ తర్వాత 3 మంకీస్‌తో పాటు మరిన్ని సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఇప్పుడు ఈయన డేట్స్ హాట్ కేక్.. 30 రోజులు ఫుల్ బిజీగానే ఉన్నాడు. జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఇంకా చాలా షోస్ చేస్తున్నాడు సుధీర్.
 
అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు తనకంటూ బుల్లితెరపై స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. మ్యాజిక్ చేస్తూ సినిమా వాళ్లకు చేరువైన ఈయన.. గెటప్ శ్రీను పుణ్యమా అని జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు. రూమ్ మేట్స్ అయిన సుధీర్, శ్రీను.. ఆ తర్వాత టీమ్ మేట్స్ అయ్యారు. 
 
శ్రీనునే జబర్దస్త్ కమెడియన్ వేణుకు పరిచయం చేయడం.. ఆ తర్వాత జబర్దస్త్‌లో ఎంట్రీ.. స్టార్ డమ్ జరిగాయి. ఏడేళ్లుగా వెనక్కి తిరిగి చూసుకోకుండా సుధీర్ జర్నీ సాగుతుంది. ఇక ఈయన కెరీర్‌లో రష్మి గౌతమ్ ఎప్పుడూ ప్రత్యేకమే. చెప్పుకునేంత రిలేషన్ వీళ్ల మధ్య లేకపోయినా.. గాసిప్స్ రాసుకునేంత రిలేషన్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది.
 
సంపాదన విషయంలో కూడా సుడిగాలి సుధీర్ దూకుడు చూపిస్తున్నాడు. ఈయన ఆస్తి విలువ ఎంతుంది అని తెలుసుకోడానికి అభిమానులు కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఈయన ప్రస్తుత ఆస్తి లెక్కలు కడితే దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుందని ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. 
 
ఏడాదికి కనీసం 25 నుంచి 35 లక్షలు మధ్యలో సంపాదిస్తున్నాడు సుధీర్. అందులో జబర్దస్త్ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు, ఇతర ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం కూడా మాటలు కాదు. ఎనీవే సుడిగాలి సుధీర్‌ కెరీర్‌లో ఎదగాలని ఆశిస్తూ బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments