Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HBDSamanthaAkkineni గ్లామర్ డాల్ బర్త్‌డే.. స్వయంగా కేక్ తయారు చేసిన భర్త..

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (09:57 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డాల్‌గా పేరుగాంచిన సమంత తన పుట్టినరోజును మంగళవారం జరుపుకుంటోంది. ఈ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె భర్త, టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య స్వయంగా ఓ కేక్‌ను తయారు చేసి భార్యకు బహుకరించి సర్‌ప్రైజ్ చేశాడు. 
 
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి కేవలం గ్లామర్ పాత్రలనే కాకుండా, నటనకు ఆస్కారమున్న పాత్రలను ధరిస్తూ, లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సమంత దూసుకుపోతోంది. పైగా, వివాహం తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తోంది. అలా పలువురు హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 
 
ఇకపోతే, లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం సమంత, ఆమె భర్త నాగ చైతన్య ఇంటికే పరిమితం కాగా, పుట్టిన రోజు వేడుకలు సైతం నిరాడంబరంగా సాగాయి. తన భార్య కోసం స్వయంగా చైతూ వంటగదిలోకి వెళ్లి గరిట పట్టాడు. బర్త్‌డే కేక్‌ను తయారు చేశాడు. ఆపై సమంత దాన్ని కట్ చేసి, భర్తకు తినిపించింది.
 
ఈ వీడియోను, చిత్రాలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. 'కుటుంబం ప్రేమ... నేనుదేని కోసం ప్రార్థిస్తున్నానో మీరు ఊహించలేరు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక పలువురు స్టార్ హీరో, హీరోయిన్లు, ప్రముఖులు సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments